BigTV English

Sleeping on the stomach: నడుము నొప్పికి కారణం అయ్యే ఈ 4 సమస్యలు తెలిస్తే షాక్ అవుతారు

Sleeping on the stomach: నడుము నొప్పికి కారణం అయ్యే ఈ 4 సమస్యలు తెలిస్తే షాక్ అవుతారు

Sleeping on the stomach: తరచూ నిద్రపోయే సమయంలో చాలా రకాల భంగిమల్లో నిద్రపోతుంటాం. చాలా మందికి పొట్టవైపు తిరిగి పడుకోవడం అంటే చాలా సౌకర్యవంతంగా భావిస్తుంటారు. ఈ తరుణంలో ఇదే ఓ అలవాటుగా మారిపోతుంది. దీని వల్ల వెన్నెముకపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. కేవలం పొట్టపై నిద్రపోవడం మాత్రమే కాకుండా కొన్ని ఆశ్చర్యకరమైన అలవాట్లు కూడా వెన్నెముకపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. తరచూ అలవాటు పడిపోయిన కొన్నింటి కారణంగా నడుము నొప్పి సమస్య ఏర్పడుతుంది. వీటికి దూరంగా ఉంటే నడుము నొప్పి సమస్యను నివారించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.


1. క్రిస్-క్రాస్‌గా కాళ్లు పెట్టడం :

కాళ్లను ఎక్కువ సేపు అడ్డంగా పెట్టుకుని కూర్చోవడం వల్ల రక్త ప్రవాహం తగ్గిస్తుంది. దీని కారణంగా వెన్నెముకపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది జీర్ణక్రియకు కూడా ఆటంకం కలిగిస్తుంది. అయితే మెరుగైన ప్రసరణ, సౌకర్యం కోసం నేలపై పాదాలను చదునుగా ఉండేలా కూర్చోవాలి.


2. పొట్టపై నిద్రపోవడం :

కొంత మందికి ఇది సౌకర్యంగా అనిపించినప్పటికీ, కడుపుపై ​​నిద్రపోవడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. దీని కారణంగా మెడలపై కూడా ప్రభావం చూపుతుంది. అంతే కాదు వెన్నెముకపై కడా ఇది ప్రభావం చూపిస్తుంది. అందువల్ల వెన్నెముకను తటస్థంగా ఉంచే స్లీప్ పొజిషన్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఉదాహరణకు పడుకునే సమయంలో వెనుక లేదా ప్రక్కకు సపోర్టివ్ గా దిండును పెట్టుకుని పడుకోవడం మంచిది.

3. ఎక్కువ సేపు కూర్చోవడం :

రోజంతా ఉద్యోగంలో ఎక్కువ సేపు కూర్చోవడం అనేది వెన్నెముక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. అందువల్ల కాసేపు మధ్యలో లేచి నిలబడి, సాధారణ స్ట్రెచ్‌లు లేదా సున్నితమైన కదలికలను క్రమానుగతంగా చేయడం వల్ల కీళ్లను లూబ్రికేట్‌గా ఉంచడంలో మరియు దృఢత్వాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

4. కూర్చునే విధానంలో చేసే తప్పులు :

తరచూ కూర్చునే విధానం అనేక ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తుంది. అలాగే నడక, తేలికపాటి వ్యాయామం అనేది తరచూ దినచర్యలో చేర్చడానికి ప్రయత్నించండి. ఇది కూర్చోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచుతుంది. కూర్చునే విధానంలో చేసే మార్పుల కారణంగా వెన్నెముక ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరచవచ్చు.

(గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.)

Related News

Walking For Heart Health: వాకింగ్‌తో గుండె జబ్బులకు చెక్.. పరిశోధనలో షాకింగ్ నిజాలు !

Colon Cancer: యువతకు పెద్ద పేగు క్యాన్సర్ ముప్పు.. ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు !

Diabetic Diet Guide: షుగర్ పేషెంట్లు.. ఇలా అస్సలు చేయొద్దు !

Fat Lose Tips: 99% ప్రజలకు తెలియని ఫిట్‌నెస్ రహస్యాలు.. 2 వారాల్లో ఫ్యాట్ తగ్గించుకునే ట్రిక్స్

Fruitarian Diet: పండ్లు మాత్రమే తింటూ.. యువతి సరికొత్త డైట్, చివరికి ప్రాణాలే పోయాయ్!

Potato for Face: ముఖానికి ఆలుగడ్డ రాస్తే.. ఇలా అవుతుందా?

Type-2 Diabetics: ఇంట్లోని ఉల్లిగడ్డతో ఒంట్లోని డయాబెటిస్ తరిమికొట్టొచ్చా? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Sorakaya Vadalu: కరకరలాడే సొరకాయ వడలు.. ఎలా తయారు చేయాలో తెలుసా ?

Big Stories

×