Funny Escalator Video: నగరాలు, పట్టణాల్లో ఉండే ప్రజలకు ఎస్కలేటర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. షాపింగ్స్ మాల్స్, సినిమా హాల్స్, మెట్రో స్టేషన్స్ సహా ఇతరత్రా ప్రదేశాల్లో ఇవి సాధారణంగా కనిపిస్తాయి. కామన్ గా ఎక్కి వెళ్తుంటారు. అయితే, పల్లెటూరు నుంచి పట్నంలోకి వచ్చే ప్రజలకు వీటి గురించి పెద్దగా అవగాహన ఉండదు. అందుకే, చాలా మంది వీటిని ఎక్కి ప్రయాణించేందుకు భయపడుతుంటారు. ఎక్కడ పడిపోతామో? అనే ఆందోళనతో వణికిపోతారు. ఎలాగోలా ఎక్సలేటర్ ఎక్కినా, దానిపై వారు చేసే విన్యాసాలు చూస్తుంటే, కడుపుబ్బా నవ్వాల్సిందే. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా కనిపిస్తుంటాయి. నెటిజన్లు వాటిని చూసి ఫుల్ ఫన్నీగా ఫీలవుతారు. తాజాగా ఎస్కలేటర్ కు సంబంధించిన మరో వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్లిప్ లో ఇద్దరు మహిళలు ఎక్స్ లేటర్ మీద వెళ్లే వీడియో ఫుల్ ఫన్ క్రియేట్ చేసింది. ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే..
ఎస్కలేటర్ మీద కప్పలా విన్యాసాలు
తాజాగా డాక్టర్ అజయిత అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఫన్నీ ఎస్కలేటర్ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఇద్దరు పల్లెటూరి మహిళలలు ఎస్కలేటర్ ఎక్కారు. ఇందులో ఓ మహిళ ఎస్కలేటర్ ఎక్కవ మెట్ల మీద కూర్చోగా, మరో మహిళ కాళ్లు, చేతులు ఎస్కలేటర్ మీదే ఉంచి కింది నుంచి పైకి వచ్చింది. దిగే సమయంలో చేతులు నేల మీద ఆనించి కప్పలా ఎస్కలేటర్ మీది నుంచి బయటకు రావడం అందరినీ ఆకట్టుకుంది. ఆమెతో పాటు ఆమె వెంట వచ్చని మహిళ కూడా అలాగే చేసింది. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను లక్షమందికి పైగా వీక్షించారు. వేలల్లో లైక్ చేశారు. అంతేకాదు, ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Ignore haters, enjoy life!😁 pic.twitter.com/RAnXc9qiyo
— Dr. Ajayita (@DoctorAjayita) June 28, 2025
Read Also: సైడు నుంచి చూస్తే.. కారు అనుకుంటారు.. ముందుకెళ్లి చూస్తే మబ్బు విడిపోద్ది!
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
“అమాయక మహిళలను కించ పరచాల్సిన అవసరం లేదు. ఎలా ఎక్కాలో తెలియక అలా చేశారు. వారికి ఎలా ఎక్కాలో చెప్పాలే తప్ప.. ఇలా ఎక్కారు ఏంటి? అని వెక్కిరించాల్సిన అవసరం లేదు” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఎస్కలేటర్ ఇలా ఎక్కాలా? మాకు తెలియక మరోలా ఎక్కుతున్నామే” అంటూ మరో నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. ఏమీ తెలియని మహిళలు నిజంగా ఎస్కలేటర్ ఎక్కడం గొప్ప విషయం అంటూ మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. మొత్తంగా ఈ వీడియో సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది. అదే సమయంలో మంచి వినోదాన్ని అందిస్తోంది.
Read Also: తల మీద కారు.. 14 సెకెన్లలో 100 మీటర్ల పరుగు, ఈ అరుదైన వ్యక్తుల గురించి మీకు తెలుసా?