BigTV English

Health News: మెంతి ఆకులను పరిగడుపున నమిలి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

Health News: మెంతి ఆకులను పరిగడుపున నమిలి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

Health News: మెంతులను తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడేవారికి మెంతులు చాలా సహాయపడతాయి. అయితే మెంతులు మాత్రమే కాదు మెంతి ఆకులు కూడా ఆరోగ్యకరమైన, శక్తివంతమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా వీటిని ఉదయాన్నే పరిగడుపున తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చు.


సాధారణంగా ఆకుకూరల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, ఇ, ఏ, బి కాంప్లెక్స్, ప్రొటీన్, ఫైబర్, పొటాషియం వంటి పుష్కలంగా ఉంటాయి. తరచూ వీటిని వినియోగించుకోవడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. మెంతి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహకరిస్తాయి. అంతేకాదు శరీరం వ్యాధులతో పోరాడేందుకు కూడా తోడ్పడుతుంది. మెంతి ఆకుల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం వల్ల గుండె ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది.

మెంతి ఆకులను ఖాళీ కడుపుతో తినడం వల్ల గుండె సంబంధింత వ్యాధులను తగ్గిస్తుంది. మెంతిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను బాగుపడేలా చేస్తుంది. మలబద్ధకం, జీర్ణ సంబంధింత వ్యాధులు కూడా దూరమవుతాయి. ఇందులో ఉండే విటమిన్ ఈ, ఏ చర్మం, జుట్టును సంరక్షించడానికి తోడ్పడుతుంది. చర్మంపై ఏర్పడే చికాకును కూడా తగ్గించేందుకు సహకరిస్తుంది.


మరోవైపు మెంతి ఆకులను తినడం వల్ల జీవక్రియకు కూడా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో మెంతి ఆకులు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే మెంతి ఆకులను తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఆకలిని తగ్గించడంలో సహకరించి బరువు తగ్గేలా చేస్తుంది.

Related News

Independence day Recipes: ఇండిపెండెన్స్ డేకు మూడు రంగుల్లో పులావ్, దోశ చేసి దేశభక్తిని చాటుకోండి

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. స్పెషల్ కోట్స్, విషెస్ చెప్పండిలా..

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవం.. ఆగస్ట్ 15న జరుపుకోవడానికి వెనక ఇంత కథ ఉందా ?

Acidity: క్షణాల్లోనే.. అసిడిటీని తగ్గించే బెస్ట్ టిప్స్ ఇవే !

Anemia: నిత్యం ఈ సమస్యలు వేధిస్తున్నాయా ? అయితే రక్త హీనత ఉన్నట్లే !

Diabetes In India: ఇండియాలో పెరుగుతున్న డయాబెటిస్‌ కేసులు.. కారణాలు ఇవే !

Big Stories

×