Actress Sada: వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ జయం సినిమా(Jayam Movie) ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి సదా (Sada). మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇలా ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీని ఏలిన సదా ఇటీవల కాలంలో సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఈమె సినిమా ప్రయత్నాలు కూడా చేయలేదని చెప్పాలి. ఇలా సినిమాలకు దూరంగా ఉన్న సదా పూర్తిగా తనకి ఇష్టమైన జీవితాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
ధైర్య సాహసాలు…
ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ లను ప్రారంభించారు. ఇక ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ వెండితెరపై ప్రారంభించకపోయిన బుల్లితెరపై మాత్రం పలు డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేశారు. అదేవిధంగా వైల్డ్ ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టమున్న సదా నిత్యం అడవుల వెంట వెళ్తూ ఎన్నో రకాల పక్షులు జంతువులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక భయంకరమైన ఒళ్ళు జలదరించే వీడియోని షేర్ చేశారు.
దయచేసి చంపొద్దు…
సాధారణంగా మనం పాము పేరు వింటేనే ఆమడ దూరం పరిగెడతాము అలాంటిది సదా మాత్రం ఎంతో ధైర్యంగా ఏకంగా 16 అడుగుల తాచుపామును పట్టి ఏకంగా దానిని తీసుకెళ్లి అడవిలోకి వదిలిపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వైజాగ్ సమీపంలోని అరకు ప్రాంతంలో ఒక నిర్మిస్తున్న భవనంలో 16 అడుగుల కింగ్ కోబ్రా (King Cobra)వెళ్లడంతో ఆ పామును చంపకూడదు అన్న ఉద్దేశంతో రెస్క్యూటివ్ కి ఫోన్ చేశారు. అయితే రెస్క్యూ టీంతో కలిసి సదా కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొని తాచుపామును పట్టుకొని విజయవంతంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. మనం చిన్న పాము కనిపించిన భయంతో పరుగులు పెడతాము కానీ సదా మాత్రం ఎంతో ధైర్యంగా 16 అడుగుల తాచుపామును చూస్తూ ఈ రెస్క్యూటివ్ పాల్గొని దాని క్షేమాన్ని కోరుకుంటూ చంపకుండా దట్టమైన అడవి ప్రాంతంలో వదిలారు.
ఇలా పాము ఎవరికైనా కనిపిస్తే దానిని చంపకూడదని, పాములు లేకపోతే ఎకోసిస్టమ్ పూర్తి కాదని తెలిపారు . మీకు ఎక్కడైనా పాములు కనిపిస్తే భయపడకుండా వెంటనే రెస్క్యూ టీమ్ కు కాల్ చేయాలని తెలిపారు .ఎన్నో రెస్క్యూ టీమ్స్ ఉన్నాయని, మనం గూగుల్ సెర్చ్ చేసిన వారి ఫోన్ నెంబర్స్ మనకు కనిపిస్తాయి. వెంటనే వారికి ఫోన్ చేసి పాములను పట్టించాలని వాటిని చంపకుండా దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేయాలి అంటూ అందరికీ సలహాలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ రెస్క్యూ టీమ్ ఆపరేషన్ కి సంబంధించిన వీడియోని సదా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ ఈమె ధైర్య సాహసాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేవిధంగా కెరియర్ పరంగా సదా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే బాగుంటుంది అంటూ కొంతమంది అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: Director Dead In Plane Crash: ప్రమాదంలో డైరెక్టర్ మృతి… 10 రోజులకు డెడ్ బాడి