Manchu Vishnu: మంచి విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప. ఆస్తులు అమ్మి మరీ మంచు మోహన్ బాబు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. మొదటినుంచి ఈ చిత్రంపై అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. దానికి కారణం.. ఈ సినిమాలో స్టార్ హీరోలు అందరూ క్యామియోలలో నటించడమే. మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్, శరత్ కుమార్ లాంటి పెద్ద పెద్ద నటులు ఈ సినిమాలో నటించారు. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది.
ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా..? అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులకు నేడు తెర దిగింది. ఎన్నో అంచనాల మధ్య ఈరోజు కన్నప్ప సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ అందుకుంటుంది. ఇప్పటివరకు మంచు విష్ణు ఎంత ట్రోలింగ్ కు గురైనా.. కన్నప్ప సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రకు న్యాయం చేసినట్లు చెప్పుకొస్తున్నారు. కొంతమంది నెగిటివ్ రివ్యూలను స్ప్రెడ్ చేస్తున్నా.. సినిమా చూడడానికి చాలా బావుందని చెప్పుకొస్తున్నారు.
సినిమాకు ఏదైనా హైలైట్ ఉంది అంటే అది ప్రభాస్ అనే చెప్పాలి. మొదటి నుంచి కూడా డార్లింగ్ కోసమే కన్నప్ప సినిమాను చూడడానికి ఫ్యాన్స్ ఎదురుచూసారు. ఇక ఫ్యాన్స్ ఆశలను డార్లింగ్ నిరాశపర్చలేదు. క్లైమాక్స్ 40 నిమిషాల్లో ప్రభాస్ డైలాగ్ డెలివరీ కానీ, ఆ జోక్స్ కానీ అదిరిపోయాయని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి డైలాగ్ కు అయితే థియేటర్లు దద్దరిల్లాయని అంటున్నారు. ఇక ప్రభాస్ తరువాత మోహన్ బాబు నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మోహన్ బాబు – ప్రభాస్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా న్యాచురల్ గా ఉన్నాయని, స్క్రీన్ పై వారిని అలా చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Manchu Manoj Review On Kannappa : కన్నప్పపై మనోజ్ రివ్యూ.. ఒక్క ముక్కతో అన్న పరువు తీశాడు
ఇక విష్ణు.. తిన్నడుగా ఒదిగిపోయాడని, తిన్నడు నుంచి కన్నప్పగా అతను మారే విధానాన్ని చాలా బాగా చూపించారని, ప్రీతీ ముకుందన్ అందాలతో పాటు ఆమె హవాభావాలు కూడా అదిరిపోయాయని, ఈ సినిమా తరువాత ప్రీతీకి మంచి అవకాశాలు వస్తాయని అంటున్నారు. ఇక నాథనాధుడి క్యారక్టర్ లో గంబీరమైన వాయిస్ తో శరత్ కుమార్ అదరగొట్టేసాడని, శివయ్య కు తన కన్ను దానం చేసే సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచిందని, ఆ సీన్ లో మాత్రం మంచు విష్ణును ప్రశంసించకుండా ఉండలేరని చెప్పుకొస్తున్నారు.
సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తూ ఇంకా హైప్ పెంచుతున్నారు. ముఖ్యంగా చాలామంది ప్రేక్షకులు జీవితంలో విష్ణు అన్న హిట్ కొడతాడనుకోలేదురా.. చాలు ఇక ఎట్టకేలకు కన్నప్పతో హిట్ కొట్టేశాడు అంటూ ఎమోషనల్ అయిపోతున్నారు. ఎంతోకాలంగా మంచు విష్ణు ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ట్రోలింగ్ వలనో.. లేక కథలను తప్పుగా ఎంచుకోవడం వలనో విష్ణు విజయాలను అందుకోలేకపోయాడు. కానీ, కన్నప్ప సినిమాతో చాలా కాలం తరువాత విష్ణు ఒక మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరి కన్నప్ప కలక్షన్స్ ను ఏ రేంజ్ లో రాబట్టుకుంటుందో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.