Former External Affairs Minister K Natwar Singh Dies: కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. కేంద్ర మాజీ మంత్రి, మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్(93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు శనివారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన మృతి చెందినట్లు ఆయన కుమారుడు, ఎమ్మెల్య జగత్ సింగ్ వెల్లడించారు.
నట్వర్ సింగ్ 1931 మే 16న రాజస్తాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ జిల్లాలోని జఘినా గ్రామంలో జన్మించారు. అజ్మీర్ లోని మాయో కళాశాలతోపాటు గ్వాలియర్ లోని సింధియా పాఠశాలలో ప్రారంభ విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. అక్కడి నుంచి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కార్పస్ క్రిస్టీ కళాశాలలో చదువు కొనసాగించాడు. అనంతరం చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ స్కాలర్ గా కూడ చేశాడు.
Also Read: రూ. కోట్ల విలువ చేసే 16 కార్లు దగ్ధం.. ఎలా అంటే..?
రాజకీయాల్లోకి వచ్చిన నట్వర్ సింగ్.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్ప సమయంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2004 నుంచి 2005 మధ్య యూపీఏ హయాంలో విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే పాకిస్తాన్ లో భారత రాయబారిగా పనిచేశారు. అంతకుముందు 1966 నుంచి 1971 వరకు ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కార్యాలయంలో కూడా పనిచేశారు. 1984లో కేంద్రం నట్వర్‌ను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతో పాటు ఆయన పలు పుస్తకాలను సైతం రాశారు.