BigTV English
Advertisement

Who Is Santiago Martin: రాజకీయ పార్టీలకు రూ.1368 కోట్లు అందించిన.. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా..?

Who Is Santiago Martin: రాజకీయ పార్టీలకు రూ.1368 కోట్లు అందించిన.. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా..?

Who Is Santiago MartinWho Is Santiago Martin: ఎలక్టోరల్ బాండ్స్‌ కొనుగోలు చేసిన వారి వివరాలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్ కు సమర్చించింది. అయితే ఈ డేటాను ఈసీ తన వెబ్ సైట్ లో పొందుపరిచింది. అయితే ఈ డేటా రిలీజ్ అయ్యాక దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మార్మోగుతోంది. ఈ సంస్థ 2024 జనవరి వరకు రూ.1368 కోట్లు విలువ చేసే ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. దీంతో ఈ సంస్థ యజమాని ఎవరనే విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి ఆయన ఎవరు? అతని కథేంటో తెలుసుకుందామా మరి..!


SBI వెల్లడించిన ఎలక్టోరల్ బాండ్స్ డేటా ప్రకారం.. రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళాలు ప్రకటించిన సంస్థగా ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిలిచింది. దీంతో ఈ సంస్థ యజమాని ఎవరనేదానిపై ప్రజలు ఆసక్తి పెరిగింది. ఈ సంస్థకు చెందిన వెబ్ సైట్ ప్రకారం.. ఈ సంస్థకు యజమానిగా శాంటియాగో మార్టిన్ గా ఉన్నాయి. అయితే ఈయన మయన్మార్ లో కూలీగా పనిచేస్తూ.. ఈరోజు దేశంలోని రాజకీయ పార్టీలకు అత్యధిక మొత్తంలో విరాళాలు అందించే స్థాయికి ఎలా ఎదిగారో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ఎవరీ శాంటియాగో మార్టిన్..?
శాంటియాగో మార్టిన్ జీవితం అనేది మయన్మార్ లో ప్రారంభమైంది. అక్కడ ఆయన కూలీగా పనిచేసేవారు. ఆ తర్వాత 1988లో భారత్ కు తిరిగి వచ్చి 13 ఏళ్ల వయస్సులో తమిళనాడులో లాటరీ ప్రారంభించారు. తమిళనాడులో మంచి లాభాలు రావడంతో తన వ్యాపారాన్ని సామ్రాజ్యాన్ని కర్ణాటక, కేరళతో పాటుగా ఈశాన్య రాష్ట్రాలకు కూడా విస్తరించారు. ఇండియాలోని పలు రాష్ట్రాల్లో విస్తరించిన ఆయన వ్యాపారం క్రమంగా నేపాల్, భూటాన్ కూడా వ్యాప్తి చెందాయి. ఈ రంగంతో పాటుగా మార్టిన్ స్థిరాస్తి, నిర్మాణ, టెక్స్ టైల్స్, ఆతిథ్య రంగాల్లోకి అడుగుపెట్టి కోట్లలో సంపాదించాడు. ప్రస్తుతం ఈయన ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ లాటరీ ట్రేడ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన నేతృత్యంలో తన కంపెనీకు వరల్డ్ లాటరీ అసోసియేషన్ సభ్యత్వం కూడా ఉంది. ఈ కంపెనీ ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో వంటి వాటిని నిర్వహిస్తోంది.


Also Read: What is Electoral Bond : దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటో తెలుసా..?

 

ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలు ఏంటి..?
ఫ్యూచర్ గేమింగ్ సంస్థపై ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED), ఇన్‌కమ్ ట్యాక్స్(IT) డిపార్ట్‌మెంట్‌తో సహా పలు కేంద్ర ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. 2007 సంవత్సరంలోనే ఈయనపై సీబీఐ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈయన ప్రారంభించిన లాటరీ వ్యాపారంతో ప్రజలను మోసం చేయడం వల్ల సీబీఐ శాంటియాగోపై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

సీబీఐతో పాటుగా మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని పలుమార్లు ఉల్లంఘించి నేపథ్యంలో ఈయనపై ఈడీ అధికారులు చాలా సార్లు దాడులు చేశారు. ఈడీ అధికారులు నిర్విహించిన దాడుల్లో రూ.603 కోట్లను విలువైన మార్టిన్ ఆస్తులను అటాచ్ చేసింది. సిక్కీం ప్రభుత్వం అనుమతిచ్చిన లాటరీని తీసుకుపోయి కేరళలో అమ్మి.. సిక్కిం రాష్ట్రానికి దాదాపు రూ. 910 కోట్లు నష్టం వచ్చేలా చేశాడంటూ.. సీబీఐ అధికారులు గుర్తించారు. ఈయనపై 2011లో కోయంబత్తూర్ లో భూ ఆగ్రమణలు, మోసం వంటి పలు క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో పాటుగా అతని కుటుంబసభ్యులకు పైనా పలు రకాలు కేసులు ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా లాటరీ బిజినెస్‌పరంగా ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న శాంటియాగో మార్టిన్ రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళాలు ఇవ్వడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Tags

Related News

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Big Stories

×