E-Paper
Advertisement

ఏసీలు లేకుండానే ఊరంతా చల్లదనం.. చైనా మైండ్ బ్లోయింగ్ ఐడియా!

ఏసీలు లేకుండానే ఊరంతా చల్లదనం.. చైనా మైండ్ బ్లోయింగ్ ఐడియా!
Advertisement

Mist Cooling: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా కాంక్రీట్ అడవులుగా మారిన నగర వాసులు.. భానుడి భగభగలతో అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే చైనా నగరాల్లోని భవనాల పైకప్పుల నుండి కృత్రిమ వర్షం కురిపిస్తున్న విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ నీటి తుంపర్ల ద్వారా వేడికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఈ టెక్నాలజీ ఏంటి? భవనాల నుండి పడే పొగమంచు లాంటి నీటి తుంపర్లు వేడిని ఎలా తగ్గిస్తాయి? చైనా ఎందుకు ఈ వినూత్న మార్గాలను వెతుకుతోంది? అనే ఆసక్తికర విశేషాలను ఈ కథనంలో చూద్దాం.

అసలేంటీ టెక్నాలజీ?

సాధారణంగా ఎండ ఎక్కువగా ఉంటే మనం ఇంట్లో ఏసీలు ఆన్ చేసుకుంటాం. కానీ చైనా మాత్రం ఏకంగా నగర వీధుల ఉష్ణోగ్రతలనే తగ్గించే పనిలో పడింది. దీనికోసం చైనాలోని బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్ల పైకప్పులపై (Rooftops) ప్రత్యేకమైన ‘మిస్టింగ్ సిస్టమ్స్’ (Misting Systems) ను రూపొందించింది. దీని సాయంతో నీటి తుంపర్లను పొగమంచులా విడుదల చేస్తోంది. ఎండ తీవ్రత పెరగగానే ఈ వ్యవస్థ.. భవనాల పైనుండి సన్నటి నీటి తుంపర్లను కిందకు కురిపిస్తుంది. తద్వారా స్థానికులకు ఎండ వేడి నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తోంది.

Advertisement

‘మిస్ట్ కూలింగ్’ ఎలా పనిచేస్తుంది?

భవనాల నుండి వచ్చే ఈ సన్నటి పొగమంచు గాలిని ఎలా చల్లబరుస్తుందనే దాని వెనుక ‘ఇవాపొరేటివ్ కూలింగ్’ అనే శాస్త్రీయ సూత్రం దాగుంది. ముందుగా హై-ప్రెజర్ పంపులు, ప్రత్యేక నాజిళ్ల ద్వారా నీటిని అత్యంత సన్నటి తుంపర్లుగా నీటిని గాలిలోకి విడుదల చేస్తారు. అప్పుడు అవి తమ చుట్టుపక్కల వాతావరణంలోని వేడిని గ్రహిస్తాయి. ఈ తుంపర్లు చాలా చిన్నగా ఉండటం వల్ల.. అవి వేడిని గ్రహించిన వెంటనే గాల్లోకి ఆవిరైపోతాయి. అప్పటికే ఆ తుంపర్లు చుట్టుపక్కల ఉన్న వేడిని లాగేసుకోవడం వల్ల గాలిలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది. ఈ విధానం ద్వారా పరిసరాల ఉష్ణోగ్రతను 3 నుండి 6 డిగ్రీల సెల్సియస్ వరకు, కొన్ని చోట్ల అయితే గరిష్టంగా 10 డిగ్రీల వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Also Read: 40 డిగ్రీలకే కరిగిన బ్రిటన్ రోడ్లు.. 45 దాటినా చెక్కుచెదరని భారత్ రోడ్లు.. అసలు రహస్యం ఇదే!

దీని వెనుక చైనా వ్యూహం ఏంటి?

చైనాలోని పెద్ద నగరాల్లో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. అందరూ ఏసీలు వాడటం వల్ల పవర్ గ్రిడ్‌లపై భారం పడి విద్యుత్ కొరత ఏర్పడుతోంది. సాంప్రదాయ ఏసీలు వాడటం వల్ల గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలై గ్లోబల్ వార్మింగ్ సైతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడి అధికారులు.. ఈ మిస్టింగ్ సిస్టమ్స్‌ శ్రీకారం చుట్టారు. ఏసీల తరహాలో దీనికి కంప్రెసర్లు అవసరం లేదు. కేవలం నీటి ప్రెజర్ తో మాత్రమే ఇవి పనిచేస్తాయి. కాబట్టి ఇవి చాలా తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. ఈ మిస్టింగ్ టెక్నాలజీ ద్వారా ఓపెన్ గార్డెన్లు, వాకింగ్ ట్రాక్‌లు, బాల్కనీల వద్ద సహజసిద్ధమైన చల్లదనాన్ని సృష్టించి.. ఏసీలు వినియోగాన్ని తగ్గించాలని చైనా భావిస్తోంది. తద్వారా విద్యుత్ వినియోగాన్ని కంట్రోల్ చేయాలని వ్యూహం రచిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో అమలవుతున్న ఈ మిస్టింగ్ సాంకేతికతను ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించాలన్న యోచనలో అక్కడి అధికారులు ఉన్నారు.

Also Read: ఏఐ క్లీనిక్స్.. డాక్టర్ లేకుండానే సెకన్లలో రోగ నిర్ధరణ, చికిత్స.. మందులు కూడా అవే ఇచ్చేస్తాయ్!

Related News

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×