Dinesh Karthik On ENG VS PAK: ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ ( England vs. Pakistan) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ( Pakistan tour of England 2026) జరుగుతోంది. నిన్ననే ఈ రెండు జట్ల మధ్య లీడ్స్ ( Headingley, Leeds) వేదికగా తొలి టెస్ట్ షురూ అయింది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజంను చివరి క్షణంలో తప్పించింది పాకిస్తాన్. ప్రాక్టీస్ సమయంలో చేతికి గాయం అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సల్మాన్ అలీ ఆధ్వర్యంలోనే తొలి టెస్ట్ ఆడేందుకు బరిలోకి దిగింది పాకిస్తాన్.
లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శన కనబరిచింది. ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు ఆఫ్ డే లోపే పాకిస్తాన్ ఆల్ అవుట్ అయింది. 171 పరుగులు చేసిన పాకిస్తాన్, కుప్ప కూలింది. ఒక్కడుంటే ఒక్కడు కూడా సరిగ్గా ఆడలేదు. ఓపెనర్ అజాన్ డక్ అవుట్ కాగా షాన్ మసూద్ ఐదు పరుగులు మాత్రమే సాధించాడు. మహమ్మద్ రిజ్వాన్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 12 పరుగులు చేసి వికెట్ల ముందు దొరికిపోయాడు. కెప్టెన్ సల్మాన్ అలీ 21 పరుగులు చేసి, క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అటు ఇమామ్ ఉల్ హక్ 42 పరుగులు చేయగా అటు అబ్దుల్లా షఫీక్ 61 పరుగు చేసి ఇరగదీశారు. మిగిలిన ప్లేయర్లు మాత్రం మీ ఫలమయ్యారు.
పాకిస్తాన్ చెత్త ప్రదర్శన చేసిన నేపథ్యంలో కామంటేటర్ గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ( Dinesh karthik) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మ్యాచ్ లో బాబర్ ఆజం ( Babar Azam) ఆడినా కూడా పాకిస్తాన్ త్వరగానే ఆల్ అవుట్ అయ్యేదని హేళన చేస్తూ మాట్లాడారు. గత నాలుగు సంవత్సరాలుగా ఇంగ్లాండ్ కు బాబర్ ఆజం ముప్పుగా ఉన్నాడని తెగ ప్రచారం పాకిస్తాన్ చేసిందని పరువు తీశారు. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.
కేవలం వెస్టిండీస్ పై ఒక్క మ్యాచ్ గెలిస్తేనే… బాబర్ ఆజం వరల్డ్ కప్ గెలిచినట్లుగా ఫీల్ అవుతున్నాడని పరువు తీశారు. టెస్టుల్లో అతని ప్రదర్శన చాలా దారుణంగా ఉందని పేర్కొన్నారు. పైగా అతడు ఒక్క సెంచరీ కూడా చేయలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ ఈ మ్యాచ్ లో బాబర్ ఆజం ఆడి ఉన్నా, ఇంగ్లాండ్ బౌలింగ్ దళం పై పాకిస్తాన్ దాదాపు అంతే స్కోరు సాధించి ఉండేదని తన అభిప్రాయం అన్నారు టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్. ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు పాకిస్తాన్ క్రికెటర్ల ప్యాంట్లు తడిచిపోయాయని ఇజ్జత్ తీశారు.