E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Ms Dhoni: ఓయ్‌ బిహారీ అంటూ యువ‌రాజ్ న‌న్ను అవ‌మానించాడు!

Ms Dhoni: ఓయ్‌ బిహారీ అంటూ యువ‌రాజ్ న‌న్ను అవ‌మానించాడు!
Advertisement

Ms Dhoni:  టీమిండియా కెప్టెన్ గా ఎన్నో సేవలు అందించిన మహేంద్ర సింగ్ ధోని (Ms Dhoni), మూడు ఐసీసీ ట్రోఫీలు కూడా అందించాడు. 2007 సమయంలో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న మహేంద్రసింగ్ ధోని, జట్టు పరిస్థితిని పూర్తిగా మార్చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా గడ్డపై కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్న టీమిండియాను, చాలా బలంగా తయారు చేశాడు. 30కి పైగా వయస్సు ఉన్న వాళ్ళందరినీ బయటకు తరిమేసి.. యంగ్ ఇండియా ను తయారు చేశాడు. దాని ఫలితంగానే 2007, 2011 సమయాలలో వరల్డ్ కప్ లు గెలుచుకుంది టీమిండియా. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా కొట్టింది.

Also Read: Heated argument between Gautam Gambhir and Shreyas Iyer after losing the match: ఐర్లాండ్, ఇంగ్లండ్ ల‌పై గెల‌వ‌క‌పోతే కెప్టెన్సీ పీకేస్తా..శ్రేయ‌స్ కు గంభీర్ వార్నింగ్ !  

ఓయ్‌ బిహారీ అంటూ యువ‌రాజ్ న‌న్ను అవ‌మానించాడు!

Advertisement

టీమిండియా కు ఎన్నో విజయాలను అందించిన మహేంద్ర సింగ్ ధోనీని చాలామంది అవమానించినప్పటికీ అతడు ఎక్కడ తగ్గలేదు. తన పని తాను చేసుకుంటూ, మిస్టర్ కూల్ కెప్టెన్ గా తన బ్రాండ్ పెంచుకున్నాడు. అలాంటి మహేంద్ర సింగ్ ధోని తాజాగా యువరాజ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియాలోకి వచ్చినప్పుడు, తనను అరేయ్ బిహారీ అంటూ యువరాజు సింగ్ అవమానించినట్లు షాకింగ్ నిజాలను బయటపెట్టారు ధోని. నువ్వు అండర్ 19 ఆడి వచ్చావు… ఇక్కడ ఇష్టం వచ్చినట్లు సిక్సర్లు కొడితే నడవదంటూ తనను ఉద్దేశించి యువరాజ్ డ్రెస్సింగ్ రూమ్ లో దారుణంగా కామెంట్లు చేసినట్లు వివరించారు. అయితే ఈ వ్యాఖ్యలు సరదాగా యువరాజు (Yuvraj) అన్నప్పటికీ.. తన మనసులో అవి గాయంగా మారినట్లు ధోని షాకింగ్ నిజాలను పంచుకున్నట్లు ఓ పోస్టు వైరల్ గా మారింది.

ఇంతకీ యువరాజ్ గురించి ధోని ఏమన్నాడంటే

2007 కంటే ముందు టీమిండియా జట్టులోకి ధోని వచ్చాడు. అప్పటికే యువరాజ్ టీమిండియాలో కీలక ప్లేయర్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే యువరాజ్ సింగ్ ను ధోనికి కెప్టెన్సీ ఇచ్చారు. అయితే ధోని మొదటిసారి టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు.. యువరాజ్ హేళన చేశాడట. జార్ఖండ్ కూడా బీహార్ నుంచి విడిపోయిన నేపథ్యంలో.. ఓయ్ బిహారి అంటూ సంబోధించాడట యువరాజ్. ఇది అండర్ 19 క్రికెట్ కాదు.. కాస్త బుద్ధిగా ఆడాలంటూ హితువు పలికారట. సిక్సర్లు కొట్టడం వల్ల మ్యాచ్ లు గెలవలేవు అని పేర్కొన్నాడట. ఆ మాటలు విన్న ధోని అప్పటినుంచి భయపడినట్లు వివరించాడు. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడు నువ్వు కోపంగా ఎందుకుంటావు ? అని యువరాజు ధోని ప్రశ్నించాడట. తాను ఎప్పుడు సీరియస్ గా ఉండాలని… కావాలని అందరినీ భయపెట్టిస్తానని ధోనితో యూవీ క్లారిటీ ఇచ్చారట. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఈ సంఘ‌ట‌న త‌ర్వాత‌, ధోని, యువ‌రాజ్ క‌లిసి మెల‌సి జ‌ట్టును చాలా మ్యాచ్ ల్లో గెలిపించారు. కాగా ధోని వ‌ల్లే యువ‌రాజ్ కెరీర్ నాశ‌నం అయిందంటూ చాలా సార్లు యోగరాజ్ ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

Also Read: LeT Terrorists Caught On-Cam At The Funeral of Shoaib Akhtar’s Brother:  షోయ‌బ్ అక్త‌ర్ సోద‌రుడి అంత్య‌క్రియ‌లు..హాజ‌రైన‌ పహల్గామ్ సూత్రధారి

 

Related News

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్‌..పాకిస్తాన్ మ‌హిళ‌ల జ‌ట్టుకు నో ఛాన్స్‌

Ambati Rayudu: నెద‌ర్లాండ్ పై గెలిచారు క‌దా..ఇక పాక్ వీధుల్లో ర్యాలీలు చేయండి

చివ‌రి మ్యాచ్ గెలిపించినందుకు రియాజ్ జీతం పెంచాల్సిందే..నౌమన్ సెటైర్లు

సంజుపై మెడ మీద క‌త్తి వేలాడుతోంది…వైభ‌వ్ తో త‌స్మాత్ జాగ్ర‌త్త‌

ఆసియాలోనే ఫాతిమా స‌నా ఐరెన్ లేడీ…పాకిస్తాన్ కోసం ప్రాణాలు కూడా ఇస్తుంది

పాక్ మ‌హిళ క్రికెట‌ర్ల‌ను హేళ‌న చేస్తే చెప్పు తెగుద్ది..అఫ్రిదికి సనా మిర్‌ కౌంట‌ర్‌

Tanveer Ahmed: వైభ‌వ్ కాదు, దేవుడు దిగివ‌చ్చినా రెండో టీ20లో గెల‌వ‌రు

Big Stories

×