Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో దుబాయ్ లో అడుగుపెట్టింది టీమిండియా. నిన్న సాయంత్రం దుబాయ్ బయలుదేరిన టీమిండియా… అక్కడ ప్రాక్టీస్ కూడా చేయడం ఆరంభించేసింది. సెప్టెంబర్ 9వ తేదీ అంటే మరో మూడు రోజుల్లోనే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే జెర్సీస్ స్పాన్సర్ లేకున్నా… దుబాయ్ వెళ్లిపోయింది టీమిండియా. ఈ సందర్భంగా దుబాయిలో టీమిండియా దిగిన ఫోటోలు… ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఓ ప్రత్యేక విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయింది.
Also Read : Hardik – Krunal : పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. చిన్ననాటి కోచ్ కోసం భారీ సాయం.. ఎన్ని లక్షలు అంటే
జెర్సీ స్పాన్సర్ లేకున్నా కూడా 2025 టోర్నమెంట్… ఆడేందుకు టీమిండియా రంగంలోకి దిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే టీమిండియా ప్రాక్టీస్ జెర్సీ పైన ఎలాంటి స్పాన్సర్.. కనిపించలేదు. గతంలో డ్రీమ్ 11 కంపెనీ స్పాన్సర్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేవలం ఇండియా పేరుతో ఉన్న జెర్సీని మాత్రమే దుబాయ్ లో వాడుతున్నారు టీమిండియా ప్లేయర్లు. అయితే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో మొదటి మ్యాచ్ ఆడే క్రమానికి జెర్సీ స్పాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
టీమిండియా జెర్సీ స్పాన్సర్షిప్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆచితూచి అడుగులు వేస్తోంది. బెట్టింగ్ యాప్స్, టొబాకో, ఇతర వ్యసనాలకు సంబంధించిన కంపెనీలకు… చెక్ పెడుతూ… ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న కంపెనీలకు మాత్రమే జెర్సీ స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అందుకే… కాస్త సమయం తీసుకున్న కూడా.. మంచి కంపెనీకి స్పాన్సర్షిప్ ఇవ్వాలని… అదే సమయంలో డబ్బులు ఎక్కువగా తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే.. టీమిండియా జెర్సీ స్పాన్సర్షిప్ బేస్ ప్రైస్ నిర్ణయించిందట భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). ద్వైపాక్షిక మ్యాచ్లకు… 3.50 కోట్లు జెర్సీస్ స్పాన్సర్షిప్ వ్యాల్యూను పెంచేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అలాగే ఐసీసీ లేదా ఎసిసి నిర్వహించే ఒక్కో మ్యాచ్ కు 1.5 కోట్లు ఫిక్స్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కొనసాగనుంది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో మళ్లీ పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ కూడా జరగనుంది. టి20 ఫార్మాట్ లో జరగనున్న ఆసియా కప్ 20025 టోర్నమెంట్ మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో ప్రారంభం అవుతాయి. దుబాయ్లో తీవ్రమైన ఎండలు ఉన్న నేపథ్యంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్లు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.
FIRST PRACTICE SESSION OF TEAM INDIA HAS STARTED..!!! 🇮🇳
– It's time for Asia Cup Carnival. [📸: Rohit Juglan from RevSportz] pic.twitter.com/GYXvpVVevD
— Johns. (@CricCrazyJohns) September 5, 2025