E-Paper
Advertisement

విరాట్ కోహ్లీ వన్8 షూస్ పై వివాదం.. బొబ్బ‌లు, స్కిన్ ఎల‌ర్జీలు వ‌స్తున్న‌ట్లు పోస్టులు ?

విరాట్ కోహ్లీ వన్8 షూస్ పై వివాదం.. బొబ్బ‌లు, స్కిన్ ఎల‌ర్జీలు వ‌స్తున్న‌ట్లు పోస్టులు ?
Advertisement

Virat Kohli One 8 shoes : విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అండర్ 19 టీమిండియాలో అద‌ర‌గొట్టి, ఆ త‌ర్వాత‌ స్టార్ క్రికెటర్ గా ఎదిగారు. కెప్టెన్ గా టీమిండియా కు ఎన్నో విజయాలు అందించిన విరాట్ కోహ్లీ… సచిన్ టెండూల్కర్ సరసన చేరిపోయారు. అలాంటి విరాట్ కోహ్లీ వన్ 8 పేరుతో (Virat Kohli’s One 8 shoes ) షూస్ మార్కెట్లోకి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. 2017 నవంబర్ లోనే ఈ బ్రాండ్ ను మార్కెట్లోకి విడుదల చేసిన కోహ్లీ… 26 జూన్ 21వ తేదీన గ్లోబల్ లాంచ్ కూడా చేశాడు. అంతకు ముందు పుమా, అగిలిటాస్ స్పోర్ట్స్ కంపెనీలకు తన బ్రాండ్ ను అప్పగించి, షేర్ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు సొంతంగానే వన్ 8 బ్రాండ్ ను మార్కెట్లోకి తీసుకు వచ్చాడు. ఇటీవల గ్లోబల్ లాంచ్ చేయగా.. 24 గంటల్లోనే 1.5 లక్షలకు పైగా జతలు కూడా అమ్ముడై రికార్డ్ సృష్టించింది ఈ వన్ 8 బ్రాండ్.

వన్8 షూస్ పై వివాదం.. బొబ్బ‌లు, స్కిన్ ఎల‌ర్జీలు అంటూ !

విరాట్ కోహ్లీ కి సంబంధించిన వన్ 8 బ్రాండ్ బూట్లు మార్కెట్లో సేల్స్ రికార్డు సృష్టిస్తున్న నేపథ్యంలో కొంత మంది దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. విరాట్ కోహ్లీకి సంబంధించిన ఈ బూట్లు ధరిస్తే, చర్మ వ్యాధులతో పాటు బొబ్బలు వస్తున్నట్లు కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వివాదానికి తెర లేపుతున్నారు. యూట్యూబ్ ఛానల్స్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో నిన్న అర్ధరాత్రి నుంచి విరాట్ కోహ్లీ కంపెనీకి సంబంధించిన బూట్లపై విష ప్రచారం మొదలైంది. విరాట్ కోహ్లీ కంపెనీకి సంబంధించిన వన్ 8 బూట్ల వేసుకుంటే, బొబ్బలతో పాటు చర్మ వ్యాధులు వస్తున్నట్లు ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఈ కంపెనీ బూట్లను తయారు చేసేటప్పుడు నాణ్యత ఉండడం లేదని విమర్శలు చేస్తున్నారు. నాణ్యత లేకపోవడం వల్ల కాళ్లలో మంటలు కూడా పుడుతున్నాయని పోస్టులు పెడుతున్నారు.

Advertisement

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

వైద్య నిపుణులు చెబుతున్నది ఏంటంటే?

విరాట్ కోహ్లీ వన్ 8 కంపెనీకి సంబంధించిన బూట్లపై విష ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైద్య నిపుణులు కూడా కీలక విషయాలను చెబుతున్నారు. కోహ్లీకి సంబంధించిన బూట్లు నాణ్యమైనవి అని క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఒక వ్యక్తి తన కాలు సైజు కంటే తక్కువగా ఉన్న బూట్లను ధరిస్తే.. ఖచ్చితంగా స్కిన్ ఎలర్జీతో పాటు బొబ్బలు వస్తాయని స్పష్టం చేస్తున్నారు వైద్యులు. ఇక్కడ షూ కంపెనీ తప్పేం లేదని… వినియోగదారుడు సరైన సైజ్ వేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. సైజు తక్కువగా ఉండి పాదం పెద్దగా ఉంటే.. ఎంత మంచి బ్రాండ్ కొనుగోలు చేసిన రోగాలు వస్తాయని కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు. ఇదంతా తప్పుడు ప్రచారం మాత్రమేనని, కోహ్లీ బ్రాండ్లు కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

 

Related News

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్

Big Stories

Advertisement
×