E-Paper
Advertisement

బాండ్ పేపర్ రాసిస్తా.. తెలంగాణలో గెలిచేది బీజేపీయే!- ధర్మపురి అర్వింద్

బాండ్ పేపర్ రాసిస్తా.. తెలంగాణలో గెలిచేది బీజేపీయే!- ధర్మపురి అర్వింద్
Advertisement

Dharmapuri Arvind: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టత ఇచ్చారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, నేతల మధ్య ఎలాంటి లొల్లి లేదని తేల్చి చెప్పారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలపై ఆయన తనదైన శైలిలో మాట్లాడారు.

పొత్తుల్లేకుండానే అధికారంలోకి..

Advertisement

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏ ఇతర పార్టీతో పొత్తు లేకుండానే తెలంగాణలో అధికారంలోకి వస్తుందని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. కావాలంటే ఈ విషయాన్ని బాండ్ పేపర్‌పై కూడా రాసిస్తానంటూ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి పర్యటనపై విమర్శలు

Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను ఎంపీ అర్వింద్ తీవ్రంగా తప్పుపట్టారు. 25 రోజుల పాటు సుదీర్ఘ పర్యటన చేపట్టడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ఇదే సమయంలో తన కుటుంబ నేపథ్యంపై వస్తున్న వ్యాఖ్యలకు స్పందిస్తూ.. తమ నాన్న సహకారం లేకుండా గతంలో యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు లేవని, అలాంటప్పుడు తన తండ్రి పేరు చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు.

ఎన్నికల పోటీ, పార్టీ నిర్ణయం

పార్టీలో పదవుల కేటాయింపు, రాబోయే ఎన్నికల్లో పోటీ అంశాలపై కూడా అర్వింద్ మాట్లాడారు. జాతీయ ఆఫీస్ బేరర్లలో తెలుగు వారికి ప్రాతినిధ్యం ఉందని, అన్ని వేళలా అన్ని రాష్ట్రాలకూ పదవులు దక్కవని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా లేదా ఎంపీగా బరిలోకి దిగాలా అనేది బీజేపీ అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఏ సీటుకు బీ-ఫామ్ ఇస్తే దాన్నుంచే పోటీకి దిగుతానని స్పష్టం చేశారు. అలాగే కొత్తగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్లు పోయిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Also Read: సీఎం రేవంత్ బిజీ బిజీ.. నేడు CWC భేటీ.. ఆపై లండన్, న్యూయార్క్ టూర్లు!

Tags

Related News

టిమ్స్ ఆస్పత్రి వివాదం.. మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్!

మీరు వస్తానంటే మేము వద్దంటామా? ఫిరాయింపు ఎమ్మెల్యేలకు BRS ఓపెన్ ఆఫర్!

సీఎం రేవంత్ బిజీ బిజీ.. నేడు CWC భేటీ.. అనంతరం లండన్, న్యూయార్క్ టూర్లు!

22A అంశం పై సమీక్ష.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!

ముగ్గురు సభ్యులుంటే.. ఇద్దరికే రేషన్ బియ్యం!

సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేపై బండి సంజయ్ ఫైర్!

పెద్ది విగ్రహం తొలగిస్తారా? అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!

Big Stories

Advertisement
×