E-Paper
Advertisement

Hindu Marriage: రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన పెళ్లి కాదు.. హైకోర్టు సంచలన తీర్పు!

Hindu Marriage: రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన పెళ్లి కాదు.. హైకోర్టు సంచలన తీర్పు!
Advertisement

Hindu Marriage: స్వేచ్చ బ్యూరో: హిందూ వివాహ వ్యవస్థ విశిష్టతను తెలియచేస్తూ గుజరాత్ హైకోర్టు బుధవారం సంచలన తీర్పు చెప్పింది. హిందూ సంప్రదాయాల ప్రకారం మూడు ముళ్లు.. ఏడడుగుల వంటి క్రతువులను నిర్వహించకుండా కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్​ సర్టిఫికెట్​ తీసుకున్నంత మాత్రాన ఆ పెళ్లి చట్టబద్దంగా చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. హిందూ వివాహం అన్నది కేవలం పాటలు, డ్యాన్సులు, విందు వినోదాల కోసం జరుపుకునే వేడుక కాదని వ్యాఖ్యానించింది.

కౌశల్ సోనార్ అనే వ్యక్తి..

పవిత్రమైన అగ్ని సాక్షిగా వధూవరులు ఏడడుగులు వేయడమే వివాహానికి ఆధ్యాత్మిక, సామాజిక, చట్టపరమైన హోదాను కల్పిస్తుందని తేల్చి చెప్పింది. లండన్​ లో నివసిస్తున్న కౌశల్ సోనార్ అనే వ్యక్తి అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ తన సంతకాలను మోసపూరితంగా సేకరించి మ్యారేజ్ సర్టిఫికేట్ పొందిందని, తమ మధ్య ఎలాంటి సంప్రదాయ వివాహ క్రతువులు జరగలేదని కొంతకాలం క్రితం ఫ్యామిలీ కోర్టులో పిటిషన్​ వేశాడు. దీనిపై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు ఆ పిటిషన్​ ను తిరస్కరించింది.

Advertisement

Also Read: Transfers: మున్సిపల్ శాఖలో బదిలీల బండారం బట్టబయలు.. సస్పెండ్ అయిన ఇంజనీర్‌కు పోస్టింగ్!

హైకోర్టు విచారణ..

దాంతో కౌశల్​ హైకోర్టులో అప్పీల్ పిటిషన్​ వేశాడు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సదరు మహిళ కూడా తమ మధ్య ఎలాంటి పెళ్లి ఆచారాలు జరగలేదని అంగీకరించింది. దాంతో హిందూ వివాహ చట్టం ప్రకారం సప్తపది లేని వివాహం అసలు పెళ్లే కాదని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ పెళ్లి చెల్లదని తీర్పు చెప్పింది.

Advertisement

Also read: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు ఏఐతో చెక్.. సీఎం రేవంత్ బిగ్ డీల్!

Related News

తెలంగాణ సివిల్ సప్లై‌లకు బిగ్ షాక్.. రైస్ మిల్లుల ఆడిట్‌లో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే!

మెడికల్ ఆఫీసరే డ్యూటీకి రాకపోతే ఎలా.. యూపీహెచ్‌సీలో బయటపడ్డ నిర్లక్ష్యం!

మేడ్చల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. ‘శక్తి’ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్!

22ఏ భూ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కలెక్టర్‌ మను చౌదరి కీలక ఆదేశాలు జారీ!

22ఏ భూముల వివాదానికి చెక్.. సబ్‌రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆ విద్యార్థులు అందుకే చంపారు.. యూట్యూబ్‌లో చూసి మరీ..

నర్సంపేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్!

డైపర్ వేసుకుని తిరిగే రేవూరికి టికెట్ ఎలా ఇస్తావ్..సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సుస్మిత ఫైర్!

Big Stories

Advertisement
×