E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Hyderabad SIR: హైదరాబాద్ ఓటర్లకు బీఎల్ఓల షాకింగ్ న్యూస్.. ఆ తేదిలోపు ఇవ్వాల్సిందే..?

Hyderabad SIR: హైదరాబాద్ ఓటర్లకు బీఎల్ఓల షాకింగ్ న్యూస్.. ఆ తేదిలోపు ఇవ్వాల్సిందే..?
Advertisement

Hyderabad SIR: స్వేచ్ఛ బ్యూరో: ఓటరు జాబితాలో తప్పులను సరి చేయటంతో పాటు బోగస్ ఓట్ల ఏరివేతకు ఈ నెల 25 నుంచి చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను వచ్చే సోమవారం 29వ తేదీ నుంచి మరింత స్పీడప్ చేసేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఈ నెల 25వ తేదీన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రారంభించిన కేవలం అయిదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ఒక్కో సెగ్మెంట్‌లో కేవలం 5 వేల ఫారాలను పంపిణీ చేయటం పై తొలి రోజు ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగకపోవటంతో శుక్రవారం, ఆదివారం సెలవు రోజుల కారణంగా హైదరాబాద్ నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మొత్తం 43 లక్షల పై చిలుకు ఓటర్లకు సరిపోయే సంఖ్యలో ఎన్యుమరేన్ ఫారంతో పాటు ఫారం-6,7,8 లను సిద్దం చేయాలని జీహెచ్ఎంసీ ఎలక్షన్ వింగ్ కు కమిషనర్ ఆదేశాలిచ్చినట్లు సమాచారం.

హైదరాబాద్ జిల్లాలో..

సోమవారం ఉదయం సరిగ్గా పది గంటల కల్లా బూత్ లెవెల్ ఆఫీసర్లు తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ల పరిధిలో విధుల్లో ఉండాలని, స్థానికంగా నియమితులైన బూత్ లెవెల్ ఏజెంట్లను సమన్వయం చేసుకుని ప్రక్రియను వేగవంతంగానే గాక, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిసింది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తొలి రోజు కేవలం అయిదు నియోజకవర్గాల్లో కేవలం 25 వేల ఫారాలను పంపిణీ చేసిన విషయాన్నిసీరియస్ గా తీసుకునన్న జిల్లా ఎన్నికల అధికారి, ఇంత నత్తనడకన రివిజన్ జరిగితే వచ్చే నెల 24వ తేదీ కల్లా మొత్తం 43 లక్షల మంది ఓటర్లకు ఎపుడు ఫారాలు పంపిణీ చేస్తారు.

బూత్ లెవెల్ ఆఫీసర్లతో..

Advertisement

వారి ఫారాలను పూరించిన తర్వాత ఎపుడు సేకరిస్తారన్న విషయాలను పరిగణలోకి తీసుకుని ఒక్కో బూత్ లెవెల్ ఆఫీసర్ కనీసం 50 ఇళ్లను సందర్శించిన వారికి మొత్తం నాలుగు రకాల ఫారాలను అందజేయాలని అనధికారికంగా టార్గెట్ పెట్టినట్లు తెలిసింది. పైగా బూత్ ల వారీగా నియమించిన బూత్ లెవెల్ ఆఫీసర్లతో పాటు నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఇప్పటికే నియమితులైన ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, సహాయక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ రివిజన్ ప్రక్రియను నేరుగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదికలను పంపేలా షెడ్యూల్ రూపొందించినట్లు తెలిసింది.

Also read: ఒకే ఫ్రేమ్‌లో ప్రభాస్-అనుష్క.. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో క్రేజీ మూమెంట్స్!

కీలక పాత్ర పోషించనున్న బీఎల్ఏలు

Advertisement

ముఖ్యంగా ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో బోగస్ ఓట్లను తొలగించేందుకు ఎన్నికల కమిషన్ ప్రస్తుతం జాబితాలో ఉన్న ఓటరుకు సంబంధించిన మూలాలను పొందుపర్చాలని కోరటంతో 2002లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో చాలా మంది ఓటర్లు తమ సమాచారాన్ని భద్రపర్చుకోలేకపోయారు. ఆ తర్వాత కూడా ఓటరు జాబితాలో చేరిన 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు 2002 తర్వాత వివాహానం జరిగిన యువతులు కూడా తమెలాంటి సమాచారం పొందుపర్చాలన్న అయోమయంలో ఉన్నారు. కానీ వివిధ రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకును కాపాడుకోవాలన్న టార్గెట్ తో తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోని ఓటర్లకు సంబంధించిన సర్ 2002 లోని వివరాలను ఇప్పటికే సేకరించినట్లు, ఈ వివరాలను ఎన్యుమరేషన్ ఫారాల్లో పొందుపరిచేందుకు బూత్ లెవెల్ పొలిటికల్ పార్టీల ఏజెంట్లు ఇటు ఓటర్లకు, అటు బూత్ లెవల్ ఆఫీసర్లకు సమన్వయ కర్తలుగా వ్యవహారిస్తూ ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిసింది.

ఫారాలను త్వరగా స్వీకరించేందుకు బీఎల్ఓల స్కెచ్..

ఎపుడు ఎన్నికల విధులు నిర్వహించిన ఎలక్షన్ స్టాఫ్ లో జవాబుదారి తనం, పారదర్శకత కొరవడుతుందనే చెప్పవచ్చు. గురువారం నుంచి మొదలైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాని, రాష్ట్ర ఎన్నికల వింగ్, జిల్లా ఎన్నికల అధికారి ప్రకటనలు చేసినా, ఆ ఏర్పాట్లు క్షేత్ర స్థాయిలో తుస్సుమన్నాయనేందుకు మొదటి రోజుల అయిదు నియోజకవర్గాల్లో జరిగిన ఫారాల పంపిణే నిదర్శనంగా చెప్పవచ్చు. మొత్తం 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో సుమారు 43 లక్షల పై చిలుకు ఓటర్లుండగా, కేవలం అయిదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 25 వేల మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశారంటే, మొత్తం ఓటర్లలో కనీసం ఒక్క శాతం మంది ఓటర్లకు కూడా ఫారాలు పంపిణీ చేయలేదన్న విమర్శలున్నాయి.

వచ్చే నెల 23వ తేదీ..

అంతేగాక, ఓటర్లు వచ్చే నెల 23వ తేదీ వరకు పూరించిన ఫారాలను బీఎల్ఓలకు అందించాలన్న నిబంధన ఉన్నా, బీఎల్ఓలు మాత్రం గురువారం మొదటి రోజు ఫారాలు జారీ చేసిన అంతంతంమాత్రపు ఓటర్లకు జూలై 2న సమర్పించాలని, లేని పక్షంలో ఓటరు జాబితాలో మీ పేర్లు గల్లంతవుతాయని సూచించినట్లు తెలిసింది. బీఎల్ఓలు వీలైనంత త్వరగా తమ ప్రక్రియను ముగించుకునేందుకు ఓటర్లపై వత్తిడి తీసుకువస్తున్నట్లు విమర్శలున్నాయి. తొలి రోజు బీఎల్ఓలు సక్రమంగా విధులు నిర్వర్తించలేదని, కావల్సిన సంఖ్యలో ఫారాలు అందుబాటులో లేని విషయాన్ని గుర్తించిన జిల్లా ఎన్నికల అధికారి 29 నుంచి ఈ ప్రక్రియను ఫీల్డు లెవెల్ లో వేగవంతం చేసే దిశగా ఎన్నికల వింగ్ లోని అధికారులంతా ఫీల్డు లెవెల్ విధులకు వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం.

Also read: జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ కళ్లు చెదిరే ప్లాన్.. వామ్మో.. నాలుగేళ్లలో 15 కొత్త కార్లు లాంచ్!

Related News

ఖైదీలు విడుదలయ్యాక కూడా వదలని ఆఫీసర్లు.. ఫోన్ నెంబర్లు తీసుకుని మరీ..?

ఓట్ల సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి నయా స్కెచ్.. గాంధీభవన్‌లో 24 గంటల వార్ రూమ్..!

Crop Diversification: తెలంగాణ రైతులకు అలర్ట్.. వరి సాగుకు బ్రేక్.. ప్రభుత్వం సరికొత్త వ్యూహం!

హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. స్పందించిన అమెరికా అధ్యక్షుడు.. ఏమన్నారంటే?

బండి సంజయ్ కొడుకు భగీరథ్.. మళ్లీ జైలుకు, ఈ సారి..

మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్.. ఆర్టీసీ హామీలపై మంత్రి పొన్నం కీలక ప్రకటన!

యూరియా యాప్‌లో పెద్ద స్కామ్? రెండు జిల్లాల పేర్లు మాయం.. కేతిరెడ్డి సంచలన ఆరోపణలు!

Big Stories

×