E-Paper
Advertisement

Illegal Mining: గద్వాల్లో మట్టి మాఫియా అరాచకం.. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి..!

Illegal Mining: గద్వాల్లో మట్టి మాఫియా అరాచకం.. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి..!
Advertisement

Illegal Mining: స్వేచ్ఛ బ్యూరో: ధరూర్ మండలం జాంపల్లి గ్రామ శివారులో గల ర్యాలంపాడు రిజర్వాయర్ గ్రావిటీ కెనాల్ వద్ద నిల్వ ఉంచిన ప్రభుత్వ మట్టిని, గత వారం రోజులుగా మట్టి మాఫియా అడ్డగోలుగా, అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది టిప్పర్ల ద్వారా ఈ మట్టిని ధరూర్, కేటిదొడ్డి మండలాలతో పాటు గద్వాల పట్టణంలోని ప్రైవేట్ వెంచర్లు, ఇండ్ల నిర్మాణాలకు తరలిస్తూ బహిరంగంగానే వ్యాపారం సాగిస్తున్నారు.

రైతుల త్యాగాలకు విలువ లేదా?

కోట్లాది రూపాయల విలువైన తమ సొంత పంట పొలాలను దేశానికి అన్నం పెట్టే ర్యాలంపాడు రిజర్వాయర్ కాలువ నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారు. కానీ, నేడు అదే కాలువ మట్టిని కొందరు అక్రమార్కులు రాజకీయ, అధికార బలంతో దోచుకుంటుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణం. స్థానిక రైతులు తమ ఇండ్ల అవసరాల కోసం కొద్దిగా మట్టిని తీసుకెళ్తే క్షణాల్లో వచ్చి అడ్డుకునే ధరూర్ పోలీసులు, వారం రోజులుగా వందల టిప్పర్ల మట్టి అక్రమంగా తరలిపోతుంటే కనీసం పట్టించుకోకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటి?

Advertisement

Also read: UPI Payments: ఆర్టీసీ కండక్టర్ల క్యూఆర్ కోడ్ విప్లవం.. కేవలం 11 నెలల కలెక్షన్ ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాకే..!

అధికారుల నిర్లక్ష్యం – మామూళ్ల ఆరోపణలు

ఈ అక్రమ రవాణాపై ధరూర్ తహసీల్దార్‌కు, పోలీసులకు, మరియు ఇరిగేషన్ అధికారులకు జాంపల్లి రైతులు సమాచారం అందించినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. తమకు ఫిర్యాదు రాలేదని చెబుతూ అధికారులు బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులకు భారీగా మామూళ్లు అందడం వల్లే ఈ దోపిడీని చూసిచూడనట్లు వదిలేశారని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. టిప్పర్ల మితిమీరిన శబ్దాలు, రాకపోకల వల్ల జాంపల్లి, ధరూర్ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ర్యాలంపాడు కాలువ మట్టి అక్రమ రవాణాను తక్షణమే నిలిపివేయాలి. ఈ దోపిడీకి పాల్పడుతున్న మట్టి మాఫియాపై, వారికి సహకరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Also Read: ACB Raids: పట్టుకున్న ఫలితం శూన్యం.. వారికి భయం పుట్టించడంలో విఫలమవుతున్న సర్కార్!

Related News

తెలంగాణ సివిల్ సప్లై‌లకు బిగ్ షాక్.. రైస్ మిల్లుల ఆడిట్‌లో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే!

మెడికల్ ఆఫీసరే డ్యూటీకి రాకపోతే ఎలా.. యూపీహెచ్‌సీలో బయటపడ్డ నిర్లక్ష్యం!

మేడ్చల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. ‘శక్తి’ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్!

22ఏ భూ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కలెక్టర్‌ మను చౌదరి కీలక ఆదేశాలు జారీ!

22ఏ భూముల వివాదానికి చెక్.. సబ్‌రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆ విద్యార్థులు అందుకే చంపారు.. యూట్యూబ్‌లో చూసి మరీ..

నర్సంపేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్!

డైపర్ వేసుకుని తిరిగే రేవూరికి టికెట్ ఎలా ఇస్తావ్..సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సుస్మిత ఫైర్!

Big Stories

Advertisement
×