E-Paper
Advertisement

అసలే ఎల్ నినో.. రోడ్డుపై మిషన్ భగీరథ నీరు వృదా.. పట్టించుకోని అధికారులు!

అసలే ఎల్ నినో.. రోడ్డుపై మిషన్ భగీరథ నీరు వృదా.. పట్టించుకోని అధికారులు!
Advertisement

Pipeline Leak: స్వేచ్చ బ్యూరో: ప్రజలకు తాగునీటి కష్టాలు.. మరోవైపు విలువైన నీరు వృథా! పైపులైన్‌ పగిలి నీరు రోడ్డుపై పారుతున్నా సంబంధిత అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. మేడ్చల్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని బాలాజీనగర్‌ రోడ్‌ నంబర్‌–2లో మిషన్‌ భగీరథ పైపులైన్‌ పగిలి గత 15 రోజులుగా నీరు వృథాగా పోతున్నా మరమ్మతులు చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నీటి విలువ అధికారులకు తెలియదా?

ఒకవైపు ప్రజలు తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు పైపులైన్‌ నుంచి నీరు వృథాగా పోతున్నా పట్టించుకునే వారు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. పైపులైన్‌ పగిలి 15 రోజులు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజలకు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించే అధికారులు.. ఇలా వేల లీటర్ల నీరు వృథా అవుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీస్తున్నారు.

Advertisement

Aklso Read: బీసీల రిజర్వేషన్ల అంశం.. ఏపీ ప్రభుత్వం రియాక్ట్, పార్టీ పరంగా ఇస్తామన్న మంత్రి పార్థసారధి

ఇదేనా అధికారుల పనితీరు?

మిషన్‌ భగీరథ లక్ష్యం ప్రతి ఇంటికీ తాగునీరు అందించడం. కానీ పైపులైన్‌ పగిలి నీరు వృథాగా పోతున్నా మరమ్మతులు చేపట్టకపోవడం ఆ లక్ష్యానికే విరుద్ధంగా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాల్సిన అధికారులు 15 రోజులుగా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తక్షణమే మరమ్మతులు చేపట్టాలి

Advertisement

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పగిలిన పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నీటి వృథాను అరికట్టి తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Also read: సోషల్ మీడియాలో రెచ్చిపోయిన విష్ణు ప్రియ.. వీడియో వైరల్!

Tags

Related News

SIR సర్వేపై BRS నోరు విప్పకపోవడానికి కారణం BJP భయమే! – మహేష్ కుమార్ గౌడ్

అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు, ఈ ఘటనే ఎగ్జాంపుల్-సీపీ సజ్జనార్

సూర్యాపేటలో రిలే దీక్షలు.. బుల్లెట్ రైలు రూట్‌పై మిన్నంటిన నిరసనలు!

‘మోదీ గారూ కళ్ళు తెరవండి’.. ధర్మేంద్ర ప్రధాన్ ఇష్యూతో సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!

మైనార్టీ విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్.. జపాన్, జర్మనీల్లో ఉచితంగా ఉన్నత చదువులు!

మద్యానికి బానిసై.. భూమి కోసం కన్నతండ్రిని బండరాయితో బాది చంపిన కొడుకు!

ఫార్మా కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇకపై ఆ పప్పులు ఉడకవు!

Big Stories

Advertisement
×