Minister Seethakka: హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా జరిగిన ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గ ఇంఛార్జీల పనితీరు ఏమాత్రం బాగోలేదని అన్నారు. అందుకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాధ్యత నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి జిల్లా పరిస్థితి గురించి సవివరంగా చెబుతానని చెప్పుకొచ్చారు. అనంరతం బాధ్యతల నుంచి తప్పుకుంటా అని మంత్రి సీతక్క వ్యాక్యానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయానికి కమిటీ వేద్దామని తెలంగాణ ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ తెలిపారు.
మంత్రి సీతక్క అంతకుముందు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచారని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. కులగణనపై ఎమైనా సందేహాలు కానీ, అభ్యంతరాలు కానీ ఉంటే.. ఇష్టానుసారం మాట్లాడకూడదని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడొద్దని ఫైరయ్యారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని కులగణనను తాము చేసి చూపించామని పేర్కొన్నారు. తమను అభినందించాల్సింది పోయి.. విమర్శలు చేయడం ఏంటని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు.
ALSO READ: BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే పైసలే పైసల్ భయ్యా.. ఈ అర్హత ఉంటే ఇప్పుడే..?
మరోవైపు, ప్రజల కోసం తమ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వాగుడు బిజీలో పడ్డారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ అప్పు చేసిన ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
‘తెచ్చిన అప్పు అంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడమే సరిపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్లే ప్రభుత్వ పథకాలు గ్రౌండ్ లెవెల్ లోకి చేరడం లేదు. ప్రజల కోసం మేము ఏ పథకం తెచ్చినా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వాటిపై విమర్శలు చేస్తోంది. మేము అప్పు చేసిన ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నాం. సోషల్ మీడియాలో అబద్ధాల మీద అబద్ధాలు తెగ ప్రచారం చేస్తున్నారు’ అని మంత్రి సీతక్క మండిపడ్డారు.
ALSO READ: IPPB Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రూ.30,000 వరకు జీతం.. జస్ట్ ఇంటర్వ్యూతో జాబ్ భయ్యా..
గడిచిన పదేళ్లు స్వర్ణయుగమే అయితే ప్రజలు మార్పు ఎందుకు కోరుకుంటారు..? పదవులు పోయాయనే అక్కసుతో ఏ మంచి పని చేసినా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము వర్క్ బిజీలో ఉంటే బీఆర్ఎస్, బీజేపీ వాగుడు బిజీలో ఉన్నాయి. వాళ్ల తప్పులను వాళ్లు తెలుసుకోకుండా ప్రజలదే తప్పు అనే విధంగా మాట్లాడుతున్నారు. గతంలో మహిళ అంటే ఒక్క కల్వకుంట్ల కవితే అనే విధంగా చూపించారు. మా లాంటి కింది వర్గాల బిడ్డలు ఎదిగితే వాళ్లు తట్టుకోలేరు’ అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.
గడిచిన పదేళ్లు స్వర్ణయుగమే అయితే ప్రజలు మార్పు ఎందుకు కోరుకుంటారు? : సీతక్క
పదవులు పోయాయనే అక్కసుతో ఏ మంచి పని చేసినా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు
మేము వర్క్ బిజీలో ఉంటే బీఆర్ఎస్, బీజేపీ వాగుడు బిజీలో ఉన్నాయి
వాళ్ల తప్పులను వాళ్లు తెలుసుకోకుండా ప్రజలదే తప్పు అనే విధంగా… pic.twitter.com/coZmfLs3rt
— BIG TV Breaking News (@bigtvtelugu) March 5, 2025