E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Nitin Nabin: బీహార్ వలస కార్మికులతో నితిన్ నబీన్ రహస్య మీటింగ్.. బీజేపీ వేసిన స్కెచ్ ఇదే..?

Nitin Nabin: బీహార్ వలస కార్మికులతో నితిన్ నబీన్ రహస్య మీటింగ్.. బీజేపీ వేసిన స్కెచ్ ఇదే..?
Advertisement

Nitin Nabin: స్వేచ్చ బ్యూరో: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా రాష్ట్రంలో రెండ్రోజులు పర్యటించారు. తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన రాకతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటనలో భాగంగా నిర్వహించిన తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కీలక సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మూడు ముఖ్యమైన తీర్మానాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాజకీయ తీర్మానాన్ని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రవేశ పెట్టారు. వ్యవసాయ తీర్మానాన్ని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, 12 ఏండ్ల మోడీ విజయోత్సవాల తీర్మానాన్ని ఈటల ప్రవేశపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేలా ఈ మూడు తీర్మానాలను రూపొందించారు.

అమలులో వైఫల్యాలు..

తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ ప్రధానంగా ఈ మూడు అంశాలపై దృష్టిసారించనుంది. రాష్​ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానుంది. కాంగ్రెస్ నేతలను అడుగడుగునా నిలదీయాలని పార్టీ నిర్ణయించుకుంది. రాజకీయ తీర్మానంలో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన విధానాలు, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, శాంతిభద్రతల క్షీణత వంటి అంశాలపై ఈ తీర్మానంలో సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే రోజుల్లో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేశారు. ఇప్పటికే నిరుద్యోగ సమస్య, జాబ్ క్యాలెండర్ అమలులో జాప్యం, నిరుద్యోగ భృతి, గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులపై యువత పక్షాన బీజేపీ పోరాడింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నించింది. అలాగే.. భవిష్​యత్ లోనూ యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు.

ఈ మూడు తీర్మానాలు..

Advertisement

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల విజయోత్సవాలపై తీర్మానం ప్రవేశపెట్టారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ఆయన సాధించిన విజయాలపై ప్రత్యేక చర్చ జరిగింది. దేశ ప్రధానిగా మోడీ అందించిన 12 ఏళ్ల అద్భుత ప్రగతి, సుపరిపాలనను కొనియాడుతూ కార్యవర్గం ఘనంగా విజయోత్సవ తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానం ద్వారా మోడీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు.

Also read: హనుమకొండలో విషాదం.. పెళ్లింట్లో విద్యుత్ షాక్ తో తండ్రి, కొడుకు మృతి

రైతు రుణమాఫీ..

Advertisement

ఇకపోతే.. తెలంగాణలోని రైతులకు అండగా ఉండాలని కాషాయ పార్టీ నిర్ణయించింది. రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో కాకపోవడం, రైతు భరోసా పెట్టుబడి సాయం అందకపోవడం, పంట నష్టపరిహారం చెల్లింపుల్లో నిర్లక్ష్యం, సాగునీటి కష్టాలపై ఈ తీర్మానంలో స్పష్టమైన కార్యాచరణను సిద్ధం చేశారు.ఈ మూడు తీర్మానాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో ఉధృతమైన పోరాటాలు చేయాలని పార్టీ నిర్ణయించింది. కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, ప్రతి గ్రామంలోనూ ప్రజాసమస్యలపై ఉద్యమించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

కరీంనగర్ కార్పొరేషన్..

అలాగే భవిష్యత్ లో జరిగే జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి ట్రై కార్పొరేషన్లు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగురవేయాలని పార్టీ నిర్ణయించింది. కరీంనగర్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని స్పష్టంచేసింది. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఉందనేందుకు ఇది నిదర్శమని, కష్​టపడి పోరాడితే అధికారంలోకి రావడం తథ్యమని భావిస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) క్షేత్రస్థాయి విస్తరణే లక్ష్యంగా నగరంలో కీలక భేటీలు జరిగాయి.

ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం..

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా వచ్చిన నితన్ ఆర్ఎస్ఎస్ పరివార్ క్షేత్రాల ప్రతినిధులతో నగరంలోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం కేశవ నిలయంలో నితిన్ నబీన్ ప్రత్యేకంగా బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమన్వయ సమావేశంలో తెలంగాణ వ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ శ్రేణులను క్షేత్రస్థాయికి ఎలా తీసుకెళ్లాలనే దానిపై రోడ్‌మ్యాప్ రూపొందించారు. సంస్థాగతంగా బలోపేతమవ్వడంపై చర్చ జరిగినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఉమ్మడి వ్యూహాలతో, పూర్తి సామర్థ్యంతో ఎలా పనిచేయాలనే అంశాలపై సంఘ్ పెద్దలతో కలిసి ఆయన చర్చించినట్లు సమాచారం.

బీహార్ వలస కార్మికులు..

ఇదిలాఉండగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా తన తెలంగాణలో పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో నివసిస్తున్న బీహార్ వలస కార్మికులు, ఉద్యోగులు, స్థిరపడిన నివాసితులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూనే, రెండు రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, జాతీయస్థాయిలో బీజేపీ బలోపేతానికి ప్రవాస బీహార్ ప్రజలు అందించాల్సిన మద్దతుపై ఆయన మాట్లాడారు. మొత్తంగా, ఈ వ్యూహాత్మక సమావేశాలు తెలంగాణలో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ బంధాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, రాబోయే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరి తెలంగాణ బీజేపీ నాయకులు హైకమాండ్ ఆదేశాలకనుగుణంగా పనిచేసి అధికారంలోకి తీసుకొస్తారా? లేదా? అనేది చూడాలి.

Also read: Fake Accreditation: కొత్త అక్రిడేషన్ కార్డుల పేరుతో కిలాడీ ప్లాన్.. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ కార్డు తయారీ..!

Related News

Public Schools: ఆరుట్ల సక్సెస్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. వచ్చే 3 నెలల్లో ఆ మూడు ఓపెన్..?

యాదగిరిగుట్ట బోర్డు చిచ్చు.. తగ్గేదే లేదంటున్న రాజగోపాల్ రెడ్డి.. అధిష్ఠానం వద్దకు చేరిన లొల్లి!

Rythu Bharosa: తెలంగాణ రైతన్నల గుండెల్లో లబ్ డబ్ గుబులు.. మళ్లీ కోతలు తప్పవా..?

తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు సేఫేనా? వరుస ప్రమాదాలపై ప్రజాందోళన!

Mining Department: గనుల శాఖలో ఐటీ విభాగం జోరుగా ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు..!

తెలంగాణలో ‘బెంగాల్’ స్కెచ్ సాగదు.. బీజేపీ, బీఆర్ఎస్ అంతర్గత గుట్టు విప్పిన టీపీసీసీ చీఫ్!

Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్‌‌కు మొదటి రోజే పెద్ద సవాల్.. ఏంటో తెలుసా..?

Big Stories

×