Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా దంచికొట్టాయి. కానీ రెండు రోజుల అటు ఏపీ, ఇటు తెలంగాణ అకాల వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల్లో వాతావరణంలో భిన్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పొద్దంతా భారీగా ఉష్ణోగ్రతల నమోదు అవుతున్నాయి. రాత్రి కాగానే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పిడుగులు, మెరుపులతో వర్షం..
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పగటి వేళ భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండలు, తీవ్రమైన వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే రాత్రి కాగానే పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. నిన్న రాత్రి కురిసిన వర్షానికి రాష్ట్ర వ్యాప్తంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. భాగ్యనగరంలో నిన్న కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంతేగాక బలమైన ఈదురు గాలులకు ఇండ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు.
Also Read: MED Recruitment: ఆ జిల్లాలో 79 ఉద్యోగాలు.. పది పాసైతే చాలు..
23 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
అయితే, మరోసారి తెలంగాణ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలను అలెర్ట్ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు, మూడు గంటల్లో పిడుగులు, మెరుపులు, రాళ్లతో కూడిన వర్షం పడే అవకాశం ఉందనా అంచనా వేసింది. ఈ రోజు రాత్రి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే ఈ రోజు రాత్రికి 23 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వివరించింది.
12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
హైదరాబాద్ మహా నగరంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణలోని 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read: BPNL Recruitment: టెన్త్, ఇంటర్ అర్హతతో 12,891 ఉద్యోగాలు.. జీతం రూ.75,000
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
అయతే పగటి వేళ అంతా ఎండలు దంచికొడుతుండగా.. రాత్రి కాగానే వర్షం భారీగా పడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణంలో భిన్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అకాల వర్షాలు, భారీ ఈదురు గాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు ఇంట్లో బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.