Nindu Noorella Saavasam Serial Today Episode : మనోహరిని కలిసి వెళ్లిపోతున్న చిత్ర లాన్ కూర్చున్న వినోద్ తనను చూడటం లేదని మను బాయ్ అంటుంది. దీంతో అందరూ చిత్రను చూస్తారు. మనోహరి షాక్ అవుతుంది. చిత్ర హాయ్ వినోద్ గారు బాయ్ అని చెప్తుంది. దీంతో నిర్మల అదేంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావా..? వెళ్లిపోయావు అనుకున్నాను అంటుంది. దీంతో చిత్ర దగ్గరకు వెళ్లి లేదు ఆంటీ.. మనోహరితో మాట్లాడుతూనే ఉన్నానా..? అసలు టైం తెలియలేదు అని చెప్తుంది. ఇంతలో శివరాం పర్వాలేదులే అమ్మా భోజనం చేసి వెళ్లు అంటాడు. పర్వాలేదులే అంకుల్ నేను ఇంటికి వెల్లి ఏదో ఒకటి కుక్ చేసుకుని తింటాను అని చెప్తుంది. దీంతో వినోద్ ఇంటికి వెళ్లి ప్రిపేర్ చేసుకోవడం ఎందుకు ఇక్కడ రెడీగానే ఉంది కదా..? డిన్నర్ చేసి వెళ్లండి అని చెప్తాడు.
చిత్ర అనుమానంగా మనోహరి వైపు చూస్తుంటే.. మనోహరి గారు మీరు చెప్తే మీ ఫ్రెండ్ డిన్నర్ చేసేలా లేదు మీరైనా చెప్పండి అంటాడు. మనోహరి కోపంగా చిత్ర డిన్నర్ చేసి వెళ్లు అంటుంది. మను నీకోసం నేను డిన్నర్ చేస్తాను. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా అంటుంది. అందరూ కలిసి లోపలికి వెళ్లి భోజనం చేస్తుంటారు. ఇంతలో నిర్మల భాగీ, అనామిక మీరు కూర్చోండి అందరం కలిసి తిందాం అంటుంది. మిస్సమ్మ పర్వాలేదు అత్తయ్యా మేము తర్వాత తింటాం అని చెప్తుంది. దీంతో శివరాం కావాల్సినవి అన్ని ఇక్కడే ఉన్నాయి కదమ్మా ఎవరికి ఏమీ కావాలో వాళ్లు పెట్టుకుంటారు. ముందు మీరు కూర్చోని తినండి అని చెప్తాడు. దీంతో చిత్ర ఒంటరిగా తినడం.. ఒంటరిగా ఉండటం ఎంత కష్టమో నాలాంటి అనాథలకే తెలుసు.. ప్లీజ్ మీరు కూర్చోని తినండి అని చెప్తుంది. మిస్సమ్మ మాత్రం పర్వాలేదదండి మీరు భోజనం చేయండి అని చెప్తుంది. ఇంతలో వినోద్ అమ్మా ఈ పప్పును ఎంత మిస్ అయ్యానో తెలుసా..? అచ్చం వదిన చేసినట్టే చేశావు అంటాడు.
దీంతో శివరాం చేసింది మీ వదినే కదరా..? అదే భాగీ వదినరా..? అంటాడు. నీకు ఏ వంట ఇష్టమో అన్ని కనుక్కుని చేసిందిరా అని నిర్మల చెప్పగానే.. వదిన చేసినట్టు వంట చేస్తేనో.. వదినలా మాట్లాడితేనో వదిన అయిపోరు కదమ్మా అంటాడు వినోద్. దీంతో అనామిక అదేంటి వినోద్ అలా మాట్లాడుతున్నావు.. సాయంత్రం నుంచి తను ఈ వంట చేయడానికి ఎంత కష్టపడిందో తెలుసా..? అంటుంది. నిర్మల కూడా వదినతో అలా మాట్లాడొచ్చా.. అంటుంది. నాకున్నది ఒక్కరే వదిన. కొత్త బంధుత్వాలు.. నాపై రుద్దకండి. ఆవిడ ఈ ఇంటి కోడలు ఆ మర్యాద ఎప్పుడూ ఉంటుంది. ఈ కొత్త బంధాలు నాకు అవసరం లేదు అంటాడు వినోద్. నువ్వు అన్న ఆవిడే లేకపోతే.. ఈరోజు ఈ ఇల్లు ఈ ఇంట్లో మనుషులు ఏ పరిస్థితుల్లో ఉండేవారో నువ్వు ఊహంచిను కూడా లేవు.. ఈరోజు ఈ ఇల్లు ఒక చావును దాటుకుని ముందుకు వెళ్తుంది అంటే.. దానికి కారణం నువ్వు అన్న ఆవిడే..మీ అమ్మ ప్రాణాలు కాపాడింది. అమ్ము ప్రాణానికి తన ప్రాణం అడ్డేసింది. అమర్ లైఫ్‌ని కొత్తగా స్టార్ట్ చేసేలా చేసింది నువ్వు అన్న ఆవిడే.. అని శివరాం చెప్తాడు.
నిర్మల ఎమోషనల్‌గా అరుందతి స్థానంలో వేరొకరిని చూడటం కష్టమే నాన్నా కానీ భాగీ చాలా మంచిది.. అని చెప్తుంది. తప్పుగా మాట్లాడినందుకు ముందు మీ వదినకు సారీ చెప్పు అని శివరాం చెప్పగానే.. మిస్సమ్మ అయ్యో మామయ్యా ఏంటి మీరు వదిన అంటే అమ్మతో సమానం అంటారు. ఏ అమ్మైనా బిడ్డతో సారీ చెప్పించుకుంటుందా..? వినోద్ ముందు నువ్వు కడుపు నిండా తిను.. అక్కడ ఏం తిన్నావో ఏమో.. అందరూ తినండి అని భాగీ చెప్తుంది. అందరూ తింటుంటే.. చిత్ర అవును అంకుల్ మనుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాము అన్నారు కదా ఆ విషయం ఎంత వరకు వచ్చింది.. ఏంటి మను అలా చూస్తున్నావు.. ఓ నేను చేసుకోకుండా నీ పెళ్లి గురించి మాట్లాడతున్నాను ఏంటా అనా..? మెడలో మూడు ముళ్లు వేయించుకోవాలి అంటే మనసుకు నచిచన వాడు దొరకాలి కదా మను.. అయినా ఒక అనాధను పెళ్లి చేసుకోవాలి అంటే అమరేంద్ర గారిలాగా గొప్ప మనసు ఉండాలి. అలాంటి మనసు బయటు ఈరోజుల్లో ఎవ్వరికి ఉంటుంది అంటూ సెంటిమెంట్ డైలాగులు చెప్తుంది. దీంతో నిర్మల ఇలా ఒంటరిగానే ఉండిపోతే ఎలా అమ్మా ఒక కుటుంబమ కావాలంటే ఒక అడుగు ముందుకు వేయాలి కదమ్మా అని చెప్తుంది. వేస్తున్నాను ఆంటీ అంటూ వినోద్ వైపు రొమాంటిక్‌గా చూస్తుంది.
మరోవైపు కోల్‌కతా వెళ్లిన అమర్ రణవీర్‌ను తీసుకుని రిజిష్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లి మనోమరి పెళ్లి గురించి ఆరా తీస్తుంటాడు. విషయం తెలుసుకున్న మనోహరి, రణవీర్‌కు ఫోన్ చేసి ఎలాగైనా అమర్‌కు నిజం తెలియకూడదని చెప్తుంది. ఇప్పుడు నేను ఏమీ చేయలేనని రణవీర్ చేతులెత్తేస్తాడు. అయితే మనోహరి బాగా ఆలోచించి మిస్సమ్మకు కింద పడిపోయేలా చేస్తుంది. వెంటనే ఇంటి దగ్గర నుంచి అమర్‌కు ఫోన్ చేసి మిస్సమ్మ కింద పడిపోయిందని చెప్తాడు. అమర్ ఆ కంగారులో ఫోన్ మాట్లాడుతుంటే.. రణవీర్ మ్యారెజ్ డేటాను మార్చేస్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?