E-Paper
Advertisement

Best Selling Tata Cars: అమ్మకాల్లో దుమ్మురేపిన టాటా కార్లు, టాప్ 5లో ఉన్న కార్లు ఇవే!

Best Selling Tata Cars: అమ్మకాల్లో దుమ్మురేపిన టాటా కార్లు, టాప్ 5లో ఉన్న కార్లు ఇవే!
Advertisement

Best Selling Tata Cars 2025:  2025లో టాటా మోటార్స్ దూసుకెళ్లింది. ఈ కంపెనీకి చెందిన కార్లు అమ్మకాల్లో జోరు కొనసాగించాయి. ప్రధానంగా SUVలు,  కాంపాక్ట్ మోడల్స్ అద్భుతంగా సేల్ అయ్యాయి. ఈ ఏడాది  నవంబర్ 2025 వరకు అందుబాటులో ఉన్న మంత్లీ సేల్స్ ట్రెండ్స్.. రిపోర్ట్స్ ప్రకారం టాప్ 5 టాటా కార్లు ఇవే!

⦿ టాటా నెక్సాన్ (Tata Nexon)

2025లో ఇండియాలో టాప్ సెల్లింగ్ కారుగా నిలిచింది. సెప్టెంబర్ లో 22,573, అక్టోబర్ లో 22,083, నవంబర్ లో 22,434 యూనిట్లు అమ్ముడయ్యాయి. 5-స్టార్ సేఫ్టీ, మల్టీ పవర్‌ ట్రైన్, GST తగ్గింపుతో బాగా అమ్ముడయ్యాయి. పెట్రోల్/డీజిల్/ఈవీ ఆప్షన్స్ కారణంగా బాగా పాపులర్.  ఈ కారు 2025లో సగటున నెలకు 20,000+ యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

⦿ టాటా పంచ్ (Tata Punch)

Advertisement

మైక్రో SUV సెగ్మెంట్‌లో దాదాపు అన్‌బీటెన్ మోడల్ గా నిలిచింది టాటా పంచ్. నవంబర్ లో 18,753, అక్టోబర్ లో 16,810 యూనిట్లు, అక్టోబర్‌లో 16,810 యూనిట్లు అమ్ముడయ్యాయి. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, అఫోర్డబుల్ ధర కారణంగా టాప్ సెల్లర్ గా నిలిచింది. కాంపాక్ట్ సైజు, CNG/EV ఆప్షన్స్ కారణంగా అమ్మకాల్లో జోరందుకుంది. దీని ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

Read Also: ఇదేం కారు రా బాబు.. సెంటర్‌లో స్టీరింగ్, హాయిగా పడుకుని షికారుకూ వెళ్లొచ్చు!

⦿ టాటా టియాగో (Tata Tiago)

Advertisement

హ్యాచ్‌ బ్యాక్ సెగ్మెంట్‌లో స్టెడీ సేల్స్ కొనసాగిస్తోంది. గత కొద్ది నెలలుగా నెలకు 6,000-8,000 యూనిట్ల మధ్య అమ్ముడయ్యాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ, CNG ఆప్షన్‌తో పాపులర్ అయ్యింది.

⦿ టాటా హ్యారియర్ (Tata Harrier)

మిడ్-సైజ్ SUVలో బలమైన పెర్ఫార్మెన్స్ కనబర్చింది. ఈవీ వెర్షన్ లాంచ్ తర్వాత సేల్స్ పెరిగాయి. అక్టోబర్‌లో 4,500 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి.  ప్రీమియం SUV సెగ్మెంట్‌లో బలమైన అమ్మకాలు కొనసాగాయి. బోల్డ్ డిజైన్, స్పేషియస్ క్యాబిన్, ADAS ఫీచర్స్ తో ఆకట్టుకుంది.

Read Also: 4 ఏళ్లలో ఏకంగా 26 మోడల్స్.. 2026లో లాంచ్ కాబోయే హ్యుందాయ్ క్రేజీ కార్లు ఇవే!

⦿ టాటా అల్ట్రోజ్ (Tata Altroz)  

అల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్‌గా మంచి సేల్స్ చూసింది. అక్టోబర్‌లో 3,770 యూనిట్లు అమ్ముడయ్యాయి. సఫారి కూడా ఫ్లాగ్‌ షిప్ SUVగా స్టెడీ డిమాండ్ ఉంది. 2025 చివరి నెలల్లో టాటా సియెర్రా (Tata Sierra) లాంచ్ అయినా డెలివరీస్ 2026లో మొదలవుతాయి. సో, ఇంకా సేల్స్‌లో పెద్దగా ప్రభావం చూపలేదు. పూర్తి సంవత్సరం ఫైనల్ ఫిగర్స్ జనవరి 2026లో వస్తాయి.  ట్రెండ్ ప్రకారం నెక్సాన్, పంచ్ టాప్‌ లో ఉంటాయి.

Read Also: న్యూ సెల్టోస్ To సోరెంటో.. కియా నుంచి రాబోతున్న కత్తిలాంటి కార్లు ఇవే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×