E-Paper
Advertisement

AP CM Progress Report: 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మాడియా బ్యాన్, రైతులకు గుడ్ న్యూస్, ఇంకా ఎన్నో..

AP CM Progress Report: 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మాడియా బ్యాన్, రైతులకు గుడ్ న్యూస్, ఇంకా ఎన్నో..
Advertisement

మార్చి 8 మహిళల అభ్యున్నతే లక్ష్యం

AP CM Progress Report: మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ప్రత్యేక వీడియోలతో పాటు, లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తల సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలపై రూపొందించిన ప్రజెంటేషన్లను చంద్రబాబు వీక్షించారు. లబ్ధిదారులకు మెగా చెక్కులను పంపిణీ చేశారు. ఏపీలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. ఏపీలో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని.. మహిళల అభ్యున్నతే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు ఆయన.

మార్చి 7 కొబ్బరి కార్మికులకు బీమా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొబ్బరి కార్మికుల భద్రత కోసం కేర సురక్ష బీమా పథకం అమలు దిశగా అడుగులు వేస్తోంది. లేబర్ కమిషనర్ సమర్పించిన నివేదిక ఆధారంగా, ఈ పథకం అమలు, పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొబ్బరి చెట్లు ఎక్కే కార్మికులు, నీరా టెక్నీషియన్లు, కొబ్బరి కోత కార్మికులు ఈ పథకానికి అర్హులు. ప్రమాదవశాత్తూ మరణిస్తే లేదా పూర్తి వైకల్యం కలిగితే 7 లక్షల రూపాయల వరకు బీమా పరిహారం అందుతుంది. హాస్పిటల్ ఖర్చుల కోసం గరిష్టంగా 2 లక్షల వరకు సహాయం లభిస్తుంది. ఏడాది ప్రీమియం మొత్తం 956 రూపాయలుంటే, అందులో కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డ్ 717 భరిస్తుంది. కార్మికుడు 239 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు.

మార్చి 6 సోషల్ మీడియాపై సంచలన నిర్ణయం

Advertisement

టెక్నాలజీని సరైన దిశలో వాడేలా చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేస్తున్నట్లు శుక్రవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. పిల్లలకు సోషల్‌ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి 90 రోజుల్లో శ్రీకారం చుడతామని, 13-16 ఏళ్లలోపు వారికి సంబంధించి ఏం చేయాలన్నదానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సోషల్‌మీడియా వల్ల మన పిల్లలు నష్టపోకూడదని, దానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని దానికి బానిసైతే మాత్రం జీవితాలు నాశనమవుతాయన్నారు సీఎం చంద్రబాబు.

మార్చి 5 జనాభాపై ఫోకస్

పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఈనెల 5న ప్రకటన చేశారు. ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చామని, ఇప్పుడు జనాభా నిర్వహణ గురించి చర్చిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై డ్రాఫ్ట్‌ పాలసీ రూపొందిస్తున్నామని, నెల రోజుల పాటు చర్చ తర్వాత తుదిరూపు ఇస్తామన్నారు. రాష్ట్రంలో పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒక జంటకు కనీసం ఇద్దరు పిల్లలుండాలని, ముగ్గురు పిల్లల్ని కంటే ఇంకా మంచిదని చెప్పారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి ఎక్కువ ప్రయోజనాలు అందేలా పాలసీలను రూపొందిస్తామన్నారు.

మార్చి 5 మిషన్ జీరో పావర్టీ

Advertisement

ఏపీలో పేదరికాన్ని సంపూర్ణంగా తగ్గించి పేదల జీవన ప్రమాణాలను పెంచేలా జీరో పావర్టీ మిషన్ ను పకడ్బందీగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ విభాగాలతో జీరో పావర్టీ మిషన్ కుటుంబ సాధికారితపై ఈనెల 5న సమీక్ష నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయ సంఘాల సంస్థలు సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ వ్యవస్థలను సమన్వయం చేస్తూ జీరో పావర్టీ మిషన్ ను ముందుకు తీసుకెళ్లాలన్నారు. 1.3 కోట్ల కుటుంబాల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల్లో అమలవుతున్న పేదరిక నిర్మూలన విధానాలను స్టడీ చేయాలని, 2047 స్వర్ణాంధ్ర మిషన్ టార్గెట్స్ కు తగ్గట్లు రాష్ట్రంలో జీరో పావర్టీ మిషన్ సమర్ధంగా చేపట్టాలన్నారు. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ ద్వారా వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 1100 కోట్లును సమర్ధంగా వినియోగించుకునేలా యాక్షన్ ప్లాన్ ఉండాలన్నారు సీఎం చంద్రబాబు.

బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై సీఎం సమీక్ష

ఏపీలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 4న అసెంబ్లీలోని తన చాంబర్‌లో సమీక్ష జరిపారు. ఫ్యామిలీ ఐడీ, ఆధార్ నెంబర్, రైస్ కార్డ్ ఐడీ, విద్యార్హతలు, వృత్తి, మొబైల్ నెంబర్, చిరునామా, వ్యవసాయ భూమి, అర్బన్-రూరల్ ప్రాపర్టీ వంటి మొత్తం 26 అంశాలతో ఫ్యామిలీ డేటాబేస్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. SGSW, డిస్కమ్స్, ఎంఏయూడీ, వెబ్‌ల్యాండ్, వాహన్, HRMS, సీబీడిటీ, పంచాయతీరాజ్, మార్క్‌ఫెడ్ వంటి శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇందులో పొందుపరచాలన్నారు. ఇప్పటికే 82 శాతం సమాచారం ఉందని, వచ్చే ఏప్రిల్ 30 నాటికి 90 శాతం డేటాబేస్ రెడీ చేస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని, దానికి తగ్గట్లు అధికారులు పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.

ఉద్యోగాలపై సీఎం క్లారిటీ

ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు, ఇకపై ఇవ్వబోయే ఉద్యోగాల విషయంలో సీఎం చంద్రబాబు అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే మొత్తం 6,28,327 ఉద్యోగాలు కల్పించామని, ఇచ్చిన మాట ప్రకారం ఐదేళ్లలో 20 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలే కల్పిస్తాం తప్ప ఒక్కటి కూడా తగ్గదని స్పష్టం చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ నిర్వహించలేదన్నారు.

సీఎంతో పవన్ కళ్యాణ్ భేటీ

అభివృద్ధి, సంక్షేమం విషయంలో స్పష్టతతో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం 2028 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని, అవసరమైన ప్రణాళికలు తయారు చేసి దశల వారీగా అమలుకు చర్యలు తీసుకోవాలని సంకల్పించింది. ఈనెల 3న ఉండవల్లిలోని సీఎం నివాసానికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వెళ్లి చంద్రబాబును కలిసిన సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలపై చర్చ జరిగింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని, రోడ్లు, తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని సీఎం, డిప్యూటీ సీఎం నిర్ణయించారు. జలజీవన్‌ మిషన్‌లో చేస్తున్న, చేపట్టబోయే పనులపైనా చర్చించారు. ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే వీబీ జీరామ్‌జీ, కొత్తగా ప్రారంభమయ్యే 16వ ఆర్థిక సంఘం నిధులతోనూ గ్రామాల్లో రోడ్లు, తాగునీటి వ్యవస్థకు సంబంధించిన పనులు చేపట్టాలని సీఎం తెలిపారు.

సీఎం చంద్రబాబు ఆదేశాలు

మిడిల్ ఈస్ట్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఏపీ ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనిపై ఆర్టీజీఎస్ అధికారులు, ఎపీఎన్ఆర్టీ ప్రతినిధులతో ఈనెల 2న క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాల్లోని రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని, ఇందుకోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అక్కడ చిక్కుకుపోయిన వారిని సంప్రదించి, తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అధికారులకు సీఎం దిశానిర్దేశం

ఏపీలో వివిధ శాఖల సమర్థత పెరిగేలా, మెరుగైన సేవలు అందించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. ఆర్టీజీఎస్, పబ్లిక్ పాజిటివ్ పర్షెప్సన్‌పై క్యాంప్ కార్యాలయంలో ఈనెల 2న సమీక్ష నిర్వహించారు. కనీసం 80 శాతం నుంచి 90 శాతం తగ్గకుండా పబ్లిక్ పర్షెప్సన్ ఉండాలని అధికారులకు సూచించారు. పెన్షన్ల పంపిణీ, దీపం పథకం కింద ఇస్తున్న గ్యాస్ సిలిండర్ల డెలివరీ, స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్‌లలో టాయిలెట్లు రిపేర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్, డిజిటల్ సేవలు, సిబ్బంది ప్రవర్తనపై సంతృప్తి వ్యక్తమైందని, అవినీతికి తావులేకుండా రాష్ట్రంలోని మొత్తం 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిజాయితీ కలిగిన అధికారులకే అవకాశం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వాట్సప్ మనమిత్ర సేవలు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

ఏపీలో కొత్త కంపెనీ స్థాపన

ఏపీలో విస్తారమైన తీర ప్రాంతాన్ని అడ్వాంటేజ్ గా మార్చుకునే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా రాష్ట్రంలో ఓడల తయారీ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్‌ జాతీయ షిప్‌బిల్డింగ్‌ అండ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ పార్క్‌ పేరిట ప్రభుత్వం ఓ కంపెనీని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ గా ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీ ఓడల నిర్మాణం, రిపేర్లు, ఇతర నౌకా పరమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. కంపెనీ ఏర్పాటుపై ఏపీ మారిటైమ్‌ బోర్డుతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీని దగదర్తిలో స్థాపిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. షిప్‌ బిల్డింగ్‌ డెవల్‌పమెంట్‌ స్కీమ్‌ , మారిటైమ్‌ ఇండియా విజన్‌-2030, మారిటైమ్‌ అమృత్‌కాల్‌ విజన్‌ 2047 కింద ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.

రైతులకు గుడ్‌న్యూస్..

కూటమి ప్రభుత్వ నిర్ణయంతో ఏపీలో రైతులకు ఊరట లభించింది. పెండింగ్‌లో ఉన్న 46 వేల 113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఈనెల 2న ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా అనుమతులు జారీ చేయాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. మొత్తం పెండింగ్ దరఖాస్తులు 46,113 ఉండగా.. వీటికి 250 కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్లు మొత్తం 22.30 లక్షలు ఉన్నాయి. కొత్తగా ఇప్పటికే 1.12 లక్షల కనెక్షన్లు మంజూరు చేసింది. పెండింగ్‌లో ఉన్నవి క్లియర్ చేయడానికి మరో 10 వేల ట్రాన్స్‌ఫార్మర్లు కేటాయించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సాగు సీజన్‌కు ముందే వేలాది మంది రైతులకు కరెంట్ సౌకర్యం కలగనుంది.

Also Read: లొంగిపోయిన మావోయిస్టులకు సీఎం భరోసా, తెలంగాణ ప్రగతికి యాక్షన్ ప్లాన్ ఇదే

Story by: Anup, Big Tv

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×