E-Paper
Advertisement

సంచలన నిర్ణయం తీసుకున్న టీబీజేపీ.. కాంగ్రెస్ సర్కార్‌పై ‘జెన్ జీ’ అస్త్రం.. వర్కౌట్ అయ్యేనా..!

సంచలన నిర్ణయం తీసుకున్న టీబీజేపీ.. కాంగ్రెస్ సర్కార్‌పై ‘జెన్ జీ’ అస్త్రం.. వర్కౌట్ అయ్యేనా..!
Advertisement

Fee Reimbursement: స్వేచ్ఛ బ్యూరో: విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ పోరుబాట పట్టనుంది. ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 24, 25 తేదీల్లో ‘ఫీజు బకాయి.. బీజేపీ లడాయి’ నినాదంతో 48 గంటల దీక్ష నిర్వహించనుంది.

ఈ నెల 24వ తేదీ..

ఈ దీక్ష బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొనసాగనుంది. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభం కానుండగా.. 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్వయంగా 48 గంటల పాటు దీక్ష చేపట్టనున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కారణంగా విద్యార్థులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే దీక్ష ఉద్దేశంగా బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌..

Advertisement

రాంచందర్‌రావు చేపట్టనున్న దీక్షకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంఘీభావం ప్రకటించనున్నారు. వివిధ దశల్లో వారు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలపనున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టడంతో పాటు విద్యార్థుల సమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని బీజేపీ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల అంశంపై బీజేపీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణను చేపట్టింది. లక్షలాది మంది నుంచి సంతకాలను సేకరించింది. వాటిని త్వరలో గవర్నర్ కు అందజేయనుంది.

Also Read: రోడ్డుపైకి బండి తీస్తున్నారా.. ఇక నుంచి బీకేర్ ఫుల్.. ఈ కొత్త కెమెరాలు చూస్తే చలాన్ పక్కా పడాల్సిందే!

విద్యార్థుల సమస్యలు

Advertisement

ఫీజు బకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, కళాశాలలపై పడుతున్న ఆర్థిక భారం తదితర అంశాలను దీక్ష సందర్భంగా బీజేపీ నేతలు ప్రస్తావించనున్నారు. రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులు కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేసేలా ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి పెంచడమే 48 గంటల దీక్ష ప్రధాన లక్ష్యంగా బీజేపీ భావిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు డిమాండ్‌ చేయనున్నారు.

జెన్‌ జీ ఓటర్ల ప్రాధాన్యం..

ప్రస్తుత రాజకీయాల్లో యువత, ముఖ్యంగా జెన్‌ జీ ఓటర్ల ప్రాధాన్యం పెరుగుతోందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. సోషల్‌ మీడియా, డిజిటల్‌ వేదికలపై చురుగ్గా ఉండే ఈ తరానికి విద్య, ఉద్యోగాలు, ఫీజులు, ఉపాధి వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి అంశాలతో ప్రత్యక్షంగా విద్యార్థులను ప్రభావితం చేసే అంశాన్ని ఉద్యమ రూపంలో చేపట్టడం ద్వారా యువతలో పార్టీకి అనుకూల వాతావరణం కల్పించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

యువ ఓటర్లను..

రాబోయే రోజుల్లో జరగనున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ యువ ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా బీజేపీ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. విద్యార్థి, యువజన సమస్యలను వరుసగా ప్రస్తావిస్తూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవాలని భావిస్తోంది.

Also Read: తిరుమలలో హైటెక్ గస్తీ.. రంగంలోకి రోబోటిక్ డాగ్.. మెట్లమార్గంలో చిరుతలకు చెక్!

ప్రత్యేక దృష్టి..

గ్రాడ్యుయేట్‌ ఓటర్లలో విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత అధికంగా ఉండటంతో ఈ వర్గాలపై ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫీజు బకాయిల అంశాన్ని కేవలం ఒకరోజు ఆందోళనగా కాకుండా, యువతతో అనుసంధానమయ్యే రాజకీయ కార్యక్రమాల శ్రేణికి ప్రారంభ బిందువుగా మార్చే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

బీజేపీ వ్యూహం..

రాష్ట్ర రాజకీయాల్లో యువ ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ తాజా దీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే.. యువతకు చేరువయ్యేలా పార్టీ కార్యక్రమాలను రూపొందించాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read: మంచిర్యాల కాంగ్రెస్‌లో బిగ్ షాక్.. మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మధ్య పెరుగుతున్న దూరం!

Tags

Related News

రోడ్డుపైకి బండి తీస్తున్నారా.. ఇక నుంచి బీకేర్ ఫుల్.. ఈ కొత్త కెమెరాలు చూస్తే చలాన్ పక్కా పడాల్సిందే!

పొమ్మ‌న‌రు.. పొగ‌బెడ‌తారు.. రెబ‌ల్స్‌పై రేవంత్ మార్క్ దండ‌యాత్ర‌.. ప్ర‌తిప‌క్షాల‌కు చిక్క‌కూడ‌ద‌నే వ్యూహం..

పాలకులు మారినా మారని సరిహద్దు గ్రామాల తలరాత.. అనాథలైన ఆ ఐదు గ్రామాలు

ఫామ్‌హౌజ్‌కు పాద‌యాత్ర‌..! కేసీఆర్ సీఎం కావాల‌ని.. పెద్ద‌సారు వ‌ద్ద‌కే అభిమానులు..!

కూటమిలో ఉంటూనే ఫ్రెండ్లీ ఫైట్.. ఏపీలో బీజేపీ మైండ్ గేమ్‌ వెనుక ఉన్న అసలు స్కెచ్ ఇదే!

రైతుల ధాన్యంతో మిల్లర్ల దందా.. రికవరీ మొదలుపెట్టిన ప్రభుత్వం!

రెండు చరణాలే పాడాలా.. వందేమాతరం చుట్టూ మొదలైన కొత్త రచ్చ!

Big Stories

Advertisement
×