E-Paper
Advertisement

NDA Strategy: ఢిల్లీ పాలిటిక్స్‌లో జెట్ స్పీడ్ ట్విస్టులు.. ఈ సారీ విపక్షాలకు మైండ్ బ్లాక్ అయ్యేలా బిల్లు..?

NDA Strategy: ఢిల్లీ పాలిటిక్స్‌లో జెట్ స్పీడ్ ట్విస్టులు.. ఈ సారీ విపక్షాలకు మైండ్ బ్లాక్ అయ్యేలా బిల్లు..?
Advertisement

NDA Strategy: ఢిల్లీ వేదికగా రాజకీయాలు జెట్ స్పీడ్‌లో మారుతున్నాయ్. మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా కల్పించేందుకు కీలకంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు గత ఏప్రిల్‌లో వీగిపోయింది. మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో లోక్‌సభలో దారులు మూసుకుపోయాయ్. అయితే కేంద్రం మాత్రం పట్టువదలకుండా ప్లాన్ చేస్తోంది. ఈ వర్షాకాల సమావేశాల్లో ఎలాంటి వ్యతిరేకతకు ఛాన్స్ లేకుండా 133వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం రెడీ చేసింది.

1971 జనాభా లెక్కల ప్రకారం..

గతంలో దక్షిణాది రాష్ట్రాలు, ప్రతిపక్షాలు క్వశ్చన్ చేసిన ఇష్యూస్ కు ఈ కొత్త బిల్లులో పరిష్కారం చూపించారు. 1971 జనాభా లెక్కల ప్రకారమే రాష్ట్రాల సీట్ల సంఖ్యను అలాగే ఉంచుతూనే.. రాష్ట్రాల్లో మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సరిహద్దులను మార్చనున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచడం ద్వారా ఎస్సీ స్థానాలు 84 నుంచి 136కు.. ఎస్టీ స్థానాలు 47 నుంచి 70కి పెరగనున్నాయ్.

Advertisement

Also read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్నీ తెలుగు భాషలోనే..?

అంతర్గత విభేదాలు.. 

అయితే ఈ రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ కావాలంటే పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ అవసరం. మూడింట రెండొంతులు కావాలి. ఇక్కడే ఎన్డీఏ చాణక్య వ్యూహాన్ని అమలు చేసే పనిలో ఉంది. గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన ప్రతిపక్షాల కూటమిలో ప్రస్తుతం తీవ్ర అంతర్గత విభేదాలు, తిరుగుబాట్లు మొదలయ్యాయ్. విపక్షాల అజెండాపై అసంతృప్తితో ఉన్న పలువురు ప్రాంతీయ పార్టీల నేతలు, ఎంపీలు అధికార ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతిపక్షాల బలహీనతలను, వారిలోని తిరుగుబాట్లను ఆసరాగా చేసుకుని ఎన్డీఏ తన సంఖ్యాబలాన్ని తెరవెనుక భారీగా పెంచుకుంటోంది. ఉద్ధవ్ శివసేన చీలిపోయింది. తృణమూల్ ఎంపీలు కూడా బయటికొచ్చేస్తున్నారు. ఇలా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల దాకా మరింత గేమ్ మారబోతోందంటున్నారు.

డీలిమిటేషన్ పేరుతో..

Advertisement

మహిళా బిల్లుకు తాము వ్యతిరేకం కాదని చెప్తూనే, డీలిమిటేషన్ పేరుతో గతంలో అడ్డుకున్న విపక్షాలు.. ఇప్పుడు తమ సొంత పార్టీల్లోని తిరుగుబాట్లతో సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డాయి. అటు కొత్త బిల్లులో అభ్యంతరాలను తొలగించడం, ఇటు విపక్షాల అంతర్గత వ్యవహారాలు కూడా ఎన్డీఏకు ప్లస్ కాబోతున్నాయ్. ఈసారి 133వ సవరణ బిల్లు పార్లమెంటులో ఈజీగా నెగ్గుతుందనే ధీమా అధికార పక్షంలో కనిపిస్తోంది. ఒకవైపు చట్టసభల పునర్విభజనతో సరికొత్త పొలిటికల్ సిస్టమ్ కు బేస్ వేస్తూనే మరోవైపు వ్యూహాత్మకంగా బలాన్ని పెంచుకుంటూ ఎన్డీఏ ముందడుగు వేస్తోంది. మరి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుపై విపక్షాలు ఎలాంటి వ్యూహంతో వస్తాయో చూడాలి.

Also read: Sunil Gavaskar: ఎవ‌డికి ప‌డితే, వాళ్ల‌కు ‘ఇండియా క్యాప్’ అస్స‌లు ఇవ్వొద్దు

Related News

ఈట‌ల కోసం రేష‌న్ కార్డుల ముద్రణ‌ ఆపేసిన కేసీఆర్‌.. ఆ క‌థా క‌మామీషు ఎట్టిద‌నినా..!

ఇద్ద‌రూ దోస్తులే.. మ‌రి బెడిసికొట్టిందెక్క‌డ‌..? ఇక ఆయ‌న‌ను న‌మ్మ‌డ‌మూ క‌ష్ట‌మేనా..?

నామినేటెడ్ పదవుల తుది జాబితా సిద్ధం.. సీఎం వద్దకు చేరిన సీక్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్టు!

అప్పుడు కాంగ్రెస్ ఓడితే చాలు.. ఇప్పుడు మేము అధికారంలోకి వస్తేనే మేలు! తెలంగాణలో బెంగాల్ ఫార్ములా!

వందేమాతరానికి రాజ్యాంగ రక్షణ.. రాష్ట్రపతి ఆమోదం!

పరిటాల శ్రీరామ్ ‘సైలెంట్’ వ్యూహం.. ధర్మవరంలో ఏం జరుగుతోంది?

జంతర్ మంతర్‌ను మూసివేయండి.. కేంద్రానికి హైకోర్టు కీలక సూచన!

తెలంగాణ బీజేపీలో మైండ్ గేమ్‌.. ఢిల్లీ భేటీ తర్వాత అసలు ప్లాన్ లీక్!

Big Stories

Advertisement
×