మంచిర్యాల పారిశ్రామిక కారిడార్‌పై బీఆర్ఎస్ కుట్రలకు తెర లేపుతున్నారా? … మరో లగచర్ల ఘటన రిపీట్ చేయడానికి గులాబీ నేతలు స్కెచ్ గీస్తున్నారా? జరుగుతున్న పరిణామాలతో దానికి ఔననే సమాధానం వస్తుంది .. పారిశ్రామిక కారిడార్‌కు భూములు ఇవ్వకుండా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంట గులాబీ నేతలు … అయితే ఉపాధినిచ్చే పారిశ్రామిక కారిడార్ కావాలంటున్న రైతులు బీఆర్ఎస్ నాయకులకు ఎదురు తిరిగారంట… అయితే ఆ పార్టీ నేతలు కూట్రపూరిత చర్యలు మానుకోకపోవడం వివాదాస్పదమవుతోంది.
మంచిర్యాల జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టించాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం … వేంపల్లి, ముల్కల్ల గ్రామాల మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు.. ఆ కారిడార్ కోసం భూములను సేకరించడానికి అధికారులు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావులు రైతులతో చర్చలు జరిపారు… భూములు కోల్పోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఎకరాకు పదమూడు లక్షల రూపాయల చొప్పున పరిహరం ఇస్తామని… అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని భరోసానిచ్చారు … దాంతో భూములు ఇవ్వడానికి రైతులు సిద్దమయ్యారు … పారిశ్రామిక కారిడార్ కోసం భూములు ఇవ్వడానికి రైతులు సంతకాలు కూడా చేశారు.
అయితే పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు నిర్ణయం బీఅర్‌ఎస్ నేతకు మింగుడుపడటం లేదంట .. రైతులు భూములు ఇవ్వకుండా అడ్డుకోవడానికి బిఅర్ఎస్ కుట్రలు తెరలేపిందంటున్నారు … పారిశ్రామిక కారిడార్ వద్దంటూ ఉద్యమాలు చేయాలని రైతులను రెచ్చగొట్టిందట… రేచ్చగోట్టడమే కాదు… బిఅర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత అర్ఎస్. ప్రవీణ్ కుమార్ ఆయా గ్రామాల్లో పర్యటించారు… భూములు ఇవ్వవద్దని రైతులను లగచర్లలా లడాయికి సిద్దం కావాలని పిలుపునిస్తున్నారు. పేదల భూముల్లో కారిడార్ ఏర్పుటుని వ్యతిరేకిస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు.
రైతుల పోరాటానికి తాము మద్దతుగా ఉంటామని బీఆర్ఎస్ నేతలు భరోసా ఇస్తున్నారు. అయితే బీఅర్ఎస్ నాయకులు కుట్ర రాజకీయాలను పసిగట్టిన రైతులు… వారు గ్రామాల్లో పర్యటించినా పట్టించుకోలేదంట.. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అండ్ కో పర్యటనకు కనీస స్పందన కరువైందంటున్నారు … బయట నుండి తీసుకవచ్చిన నాయకులు తప్పితే పట్టుమని మంది స్థానిక రైతులు గులాబీ పార్టీ నాయకుల వద్దకు వెళ్లలేదట…రైతులందరు భూములు ఇవ్వడానికి సిద్దంగా ఉండటాన్ని కారు పార్టీ నాయకులు తట్టుకోలేక పోతున్నట్లు కనిపిస్తున్నారు .. ప్రవీణ్‌కుమార్ సామాజికవర్గాల కార్డు వాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా రెస్పాన్స్ రాకపోవడంతో … ఆయన మీడియాను కాకా పట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: ఫార్ములా ఈ రేసు కేసు.. ఆరున్నర గంటలపాటు విచారణ, కేటీఆర్‌కు 52 ప్రశ్నలు వాటి చుట్టూనే
భూములు ఇవ్వకుండా అడ్డుకోవాలన్న ఎత్తుగడలు బెడిసికొట్టడంతో గులాబీ పార్టీ నాయకులు నిరాశకు గురయ్యారట .. తమ పాచికలు పారలేదని .. పైగా పరువు పోయిందని గులాబీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి … కారిడార్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు చెద్దామంటే కలిసి వచ్చే వారు లేక వెనక్కి తగ్గారట .. అబద్దాలు ప్రచారం చేసినా రైతులు నమ్మకుండా … భూములు ఇవ్వడానికి సిద్దమని చెబుతున్నారట… భూములు కోల్పోతే పరిహారం, ఉద్యోగం, ఇల్లు ఇస్తుండటంతో ఎందుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కారు పార్టీ నాయకులను ఏదురు ప్రశ్నిస్తున్నారట… దీనికి గులాబీ పార్టీ నాయకులు సమాధానాలు చెప్పలేక షాక్ గురయ్యారంట … దాంతో చేసేదేమీ లేక సైలెంట్‌గా వెనుదిరగాల్సి వచ్చిందంట.