BigTV English
Advertisement

Tailoring Centers To Women: మహిళలకు చంద్రబాబు సర్కార్ భారీ గుడ్ న్యూస్.. ఫ్రీగా కుట్టుమిషన్లు, 90 రోజలు ట్రైనింగ్..

Tailoring Centers To Women: మహిళలకు చంద్రబాబు సర్కార్ భారీ గుడ్ న్యూస్.. ఫ్రీగా కుట్టుమిషన్లు, 90 రోజలు ట్రైనింగ్..

Tailoring Centers To Women: ఆంధ్రప్రదేశ్ మహిళలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 90 రోజులు(3 నెలల పాటు) టైలరింగ్ లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.


ALSO READ: Indian Post Office: టెన్త్ క్లాస్‌ అర్హతతో 21,413 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్ భయ్యా.. దరఖాస్తు చేసుకున్నారా..?

రాష్ట్రంలో మొత్తం 1,02,832 మంది టైలరింగ్ నేర్చుకునేందుకు ఇప్పటికే అప్లికేషన్ పెట్టుకున్నారని వివరించంది. దీనికోసం 255 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా 46,044 మందికి, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన 45,772 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా 11,016 మందికి కుట్టు మిషన్లను ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో వారి అందరికీ టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది. కాగా ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు సంబంధించి సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే డ్వాక్రా రుణాల పేరుతో ఆర్థిక సాయం చేస్తుంది. మహిళలకు వంట గ్యాస్ పథకాన్ని అమలు చేస్తుంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చంద్రబాబు సర్కార్ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.


ALSO READ: Minister Sitakka: నిరుద్యోగుల భారీ గుడ్ న్యూస్.. 14,000 ఉద్యోగాలకు మార్చి 8న నోటిఫికేషన్ వచ్చేస్తోంది..

తల్లికి వందనం కింద ప్రతి స్టూడెంట్ తల్లి అకౌంట్ లో రూ.15వేలు వేసేందుకు సిద్ధం అవుతున్నట్లు అసెంబ్లీలో సమావేశాల్లో మంత్రి పయ్యావుల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమాన్ని కూడా కూటమి సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కోసం చంద్రబాబు సర్కార్ మంచి స్కీంలను అమలు చేస్తుందని చెప్పుకొస్తున్నారు.

ALSO READ: Warangal Airport: మనకు స్వాతంత్ర్యం రాకముందే వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఫేమస్: మంత్రి రామ్మోహన్ నాయుడు

అయితే, ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం కూడా చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేవలం టైలరింగ్ శిక్షణ మాత్రమే కాకుండా ఈవెంట్ మేనేజ్ మెంట్ నిర్వహణ యూనిట్ల ఏర్పాటులోనూ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేయడం డెయిరీ, గొర్రెల యూనిట్లను ఏర్పాటు చేయడంలోనూ మహిళా లబ్ధిదారులకు కూటమి సర్కార్ అండగా ఉండనుంది.

Tags

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×