E-Paper
Advertisement

OTT Movie : ఇష్టపడ్డ అమ్మాయినే కొట్టి చంపే లవర్… ఆ అమ్మాయి చూపించే టార్చర్ కు ఫ్యూజులు అవుట్

OTT Movie : ఇష్టపడ్డ అమ్మాయినే కొట్టి చంపే లవర్… ఆ అమ్మాయి చూపించే టార్చర్ కు ఫ్యూజులు అవుట్
Advertisement

OTT Movie : దెయ్యాల సినిమాలు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంటాయి. ఒక్కో దెయ్యానిది ఒక్కో స్టోరీతో ప్రేక్షకులకను ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఇటువంటి సినిమాలను చూడటానికి కొంతమంది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా పగతో రగిలిపోయే ఒక దెయ్యం చుట్టూ తిరుగుతుంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్  అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

స్టోరీలోకి వెళితే

Advertisement

వరుణ్ (గుర్మీత్ చౌదరి), ఆర్య (సాయని దత్తా) తమ లైఫ్ ను కొత్త గా స్టార్ట్ చేయడానికి ఒక అపార్ట్‌మెంట్‌లోకి మారతారు. అక్కడ వీళ్ళకి వింత శబ్దాలు రావడం వల్ల భయాందోళన చెందుతారు. ఆ అపార్ట్‌మెంట్‌లో అసాధారణ సంఘటనలను గమనించడం ప్రారంభిస్తారు. ఆర్య మొదటగా ఈ అతీంద్రియ కార్యకలాపాలను గుర్తిస్తుంది. ఇక ఈ విషయం వరుణ్‌కి తెలియజేస్తుంది. వరుణ్ మొదట్లో ఈ విషయాలను తేలిగ్గా తీసుకుంటాడు. కానీ అతనికి కూడా భయంకరమైన కలలు, అనుభవాలు ఎదురవుతాయి. ఆ అపార్ట్మెంట్ లో జరిగే సంఘటనల వల్ల, రోజురోజుకూ వీళ్ళ సంబంధం క్రమంగా క్షీణిస్తుంది. ఎందుకంటే అందులో ఒక ఆత్మ వీళ్ళను బాగా ఇబ్బందిపెడుతుంది. నరకం స్పెల్లింగ్ రాపిస్తుంది. నిజానికి ఈ ఆత్మతో వరుణ్ కి గతంలో పరిచయం ఉంటుంది.

చనిపోయిన ఆత్మ గతంలో వరుణ్ కి ప్రియురాలిగా ఉంటుంది. అయితే వరుణ్ ఆమెను ప్రేమిస్తూ దారుణంగా హత్య చేస్తాడు. ఆ తరువాత ఆమె ఒక దెయ్యంగా మారి, వరుణ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో ఆ దెయ్యం వరుణ్ కి నరకం చూపిస్తుంది. ఈ దెయ్యం దెబ్బకి వరుణ్ చుక్కలు చూస్తాడు. ఎంత ప్రయత్నించినా దాని నుంచి తప్పించుకోలేక పోతాడు. చివరికి వరుణ్ తన ప్రియురాలిని ఎందుకు చంపాడు ? ఈ దెయ్యం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ? వరుణ్ పై దెయ్యం ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : లేడీ పోలీస్ ఆఫీసర్ ను పెళ్లి చేసుకోవడానికి ఊహించని పని… సీను సీనుకో ట్విస్ట్ ఇచ్చే క్రైమ్ థ్రిల్లర్

 

జీ5 (ZEE 5)లో

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది వైఫ్’ (The Wife). 2021 లో వచ్చిన ఈ సినిమాకి సర్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఇందులో గుర్మీత్ చౌదరి, సాయని దత్తా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ వరుణ్, ఆర్య అనే జంట చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ఒక కొత్త అపార్ట్‌మెంట్‌లోకి మారిన తర్వాత అక్కడ అతీంద్రియ సంఘటనలను ఎదుర్కొంటారు. ఈ సినిమా జీ5 (ZEE5) ఓటీటీలో 2021 మార్చిలో విడుదలైంది.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×