Mallareddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొంపల్లి నివాసంలో ఇవాళ ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల విషయంలో విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో ఐటీ రికార్డులో అధికారులు హెచ్చుతగ్గులను గుర్తించారు.
అలాగే.. మల్లారెడ్డి హస్పిటల్ కు సంబంధించి చాలా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఆర్థిక లావాదేవీ విషయాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. ఎవరికి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశారు..? ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు..? అనే కోణంలో అధికారులు వివరాలకు బయటకు లాగుతున్నారు.
మఖ్యంగా ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల విషయంలో భారీగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. మేనేజ్‌మెంట్ కోటాలో సర్కార్ నిర్ణయించిన ఫీజు కన్నా విద్యార్థుల నుంచి భారీగా డబ్బు లాగుతున్నారనే కంప్లైట్స్ ఎక్కువ వచ్చినట్టు తెలుస్తోంది. అదే విధంగా మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వానికి చెల్లిస్తున్న టాక్స్‌లో అధికారులు హెచ్చుతగ్గులను గుర్తించారు. ఈ క్రమంలోనే ఐటీ అధికారులు ఈ రోజు మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డితో పాటు కొడుకు భద్రారెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.
ALSO READ: Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు అప్లై చేశారా.. దరఖాస్తుకు ఇంకా వారం రోజులే..!
ALSO READ: AIIMS Recruitment: టెన్త్, ఇంటర్‌తో 3501 ఉద్యోగాలు.. తక్కువ కాంపిటేషన్, అప్లై చేస్తే జాబ్ మీదే బ్రో