E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Nitin Nabin: కాంగ్రెస్‌ను గద్దె దించే ఎకైక దమ్మున్న పార్టీ బీజేపీనే: నితిన్ నబీన్ సిన్హా!

Nitin Nabin: కాంగ్రెస్‌ను గద్దె దించే ఎకైక దమ్మున్న పార్టీ బీజేపీనే: నితిన్ నబీన్ సిన్హా!
Advertisement

Nitin Nabin: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలో కారు పార్టీని గద్దె దించేందుకు నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా పోరాడారని, కానీ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ స్వార్థానికే ప్రాధాన్యత ఇచ్చే చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు. అయినా కూడా కోట్లాడాల్సింది ఇంకా మిగిలే ఉందన్నారు. కాంగ్రెస్ ను కూడా గద్దె దించే దమ్మున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బీజేపీయేనని నొక్కి చెప్పారు. తెలంగాణలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా రాష్​ట్రానికి నితిన్ నబీన్ సిన్హా వచ్చారు. కాగా ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్, మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెల్లార్ తో పాటు పలువురు ముఖ్య నేతలు నితిన్ కు ఘన స్వాగతం పలికారు.

నితిన్ మాట్లాడుతూ..

అనంతరం రంగారెడ్డి రూరల్ జిల్లా బీజేపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి నితిన్ నబీన్ సిన్హా చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. రంగారెడ్డి రూరల్ జిల్లా కార్యాలయంతో పాటు మరో 8 జిల్లా బీజేపీ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. రంగారెడ్డి రూరల్ జిల్లా ప్రారంభోత్సవం అనంతరం వర్చువల్ గా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో బీజేపీ నూతన కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా నితిన్ మాట్లాడుతూ.. మొత్తం 9 జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవంతో తెలంగాణలో బీజేపీ సంస్థాగత విస్తరణకు మరింత బలం చేకూరిందని కొనియాడారు. జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవం తర్వాత పార్టీ దిశ మారాలని సూచించారు. రాజకీయాలు అధికారం కోసం కాదని, సేవ కోసమన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయాలు పార్టీ సిద్ధాంతాలను ప్రతిబింబించే సంకల్ప కేంద్రాలని పేర్కొన్నారు. ప్రజలకు అండగా నిలిచే సేవా కేంద్రాలని స్పష్టం చేశారు.

1984లో దేశవ్యాప్తంగా..

Advertisement

తెలంగాణ ఆవిర్భవించి ఇన్నేళ్లయినా అమరవీరులు కలలుగన్న స్వప్నం ఇంకా పూర్తిగా నెరవేరలేదన్నారు. ఆ ఆశయాలను సాకారం చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. కొందరు బీజేపీని బయటి పార్టీ అని విమర్శిస్తుంటారని మండిపడ్డారు. 1984లో దేశవ్యాప్తంగా పార్టీకి కేవలం ఇద్దరే ఎంపీలు ఉంటే, అందులో ఒకరు తెలంగాణ గడ్డ నుంచే గెలిచారనే చారిత్రాత్మక సత్యాన్ని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు కార్యకర్తలు ఎన్నో కష్టాలు, పోలీస్ లాఠీదెబ్బలు, పోరాటాలు, ప్రాణత్యాగాలతో తెలంగాణ నేలపై కమల వనాన్ని పూయించిన సీనియర్ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Also read: Rowdy Sheeters: గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాజా మాజీ రౌడీ షీటర్ల ఇష్టా రాజ్యం.. వినక పోతే కత్తులతో..?

బెంగాల్‌లో ఎన్నో హింసలు..

Advertisement

కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీల అవకాశవాద రాజకీయాలపై నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రాష్ట్రాన్ని కేవలం అధికారాన్ని అనుభవించే సాధనంగా మార్చుకున్న పాలకులను గద్దెదించే శక్తి ఒక్క బీజేపీ కార్యకర్తలకు మాత్రమే ఉందన్నారు. పాలనలో ఘోరంగా విఫలమైన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా పోరాటాల ద్వారా గద్దెదించేందుకు కార్యకర్తలు గ్రామ గ్రామాన, వీధి వీధినా కదలాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నో హింసలు, అరాచకాలను ఎదుర్కొని, పోరాటాలతో అక్కడ కమలం ఎలా వికసించిందో, తెలంగాణలో కూడా అదే చరిత్ర పునరావృతం కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ లో గెలుపు అంత సులువుగా రాలేదని పేర్కొన్నారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్ బన్సల్ రచించిన వ్యూహాలను తెలంగాణలోనూ అమలుచేయాలని కోరారు.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వం..

ప్రతి కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లాలని, వారి సేవలో ఉండాలని సూచించారు. ప్రజలకు కేంద్రం ఏమిచ్చిందనేది తెలపాలని నితిన్ నబీన్ వ్యాఖ్యానించారు. అలా అయితేనే.. తెలంగాణలో అధికారంలోకి వస్తామని వివరించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడితేనే సంపూర్ణ ప్రగతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు బీజేపీ కార్యకర్తలకు ఒక కొత్త పోరాటానికి నాంది అని, ప్రతి ఒక్కరూ సంపూర్ణ శక్తి సామర్థ్యాలతో పోరాడి మున్సిపల్ ఎన్నికల్లో కమలాన్ని వికసింపజేయాలని పిలుపునిచ్చారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ ది ఇటలీ ఆలోచన..

అనంతరం అక్కడి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల పరిధిలోని బూత్ లెవల్ అధ్యక్షులు, బూత్ ఏజెంట్లు, బీఎల్ఏ-2లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నగరంలోని ముఖ్య నాయకుల సమావేశానికి నితిన్న నబీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ది భారతీయ ఆలోచన కాదని, ఆ పార్టీది ఇటలీ ఆలోచన అని మండిపడ్డారు. 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తంచేశారు.

Also read: మంచిర్యాలలో దారణం.. తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన అన్న!

బీజేపీపై నమ్మకం..

బూత్ అధ్యక్షులను కలిసేందుకే తాను వచ్చానని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుస్తుందనే నమ్మకం తనకుందని, ఈ నమ్మకాన్ని బూత్ అధ్యక్షులు మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ ప్రజల కలలు నిజం కావాలంటే ప్రధాని మోడీతోనే సాధ్యమని నితిన్ నబీన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హామీలు ఇస్తుంది తప్ప.. వాటిని నెరవేర్చదని ధ్వజమెత్తారు.

కాళేశ్వరం పేరుతో..

ప్రతీ బూత్ పరిధిలో ఓటర్లు ఎస్ఐఆర్ లో పాల్గొనేలా చూసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే కచ్చితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పి ఓడించారని, కానీ బీఆర్ఎస్ పై వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ కు అధికారం దక్కిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసిందని, కాళేశ్వరం పేరుతో ఎంతో దోచుకుందన్నారు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు హామీలను నెరవేర్చడంలేదన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ఫైరయ్యారు. తెలంగాణలో అభివృద్ధి డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే సాధ్యమని నితిన్ నబీన్ సిన్హా వెల్లడించారు.

వీబీఐటీ కళాశాలలో..

ఇదిలా ఉండగా సోమవారం ఉదయం 10 గంటలకు ఘట్ కేసర్ లోని వీబీఐటీ కళాశాలలో నిర్వహించే స్టూడెంట్ అండ్ యూత్ కాంక్లేవ్ కు నితిన్ నబీన్ హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భువనగిరిలో ఆయనకు నాయకులు ఘన స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అశోక కన్వెన్షన్ లో గిరిజన లీడర్లతో భోజనం చేయనున్నారు. ఆపై వారితో చర్చిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి వరంగల్ కు చేరుకుంటారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో వరంగల్ జిల్లాకు చెందిన బూత్ ప్రెసిడెంట్లతో నితిన్ నబీన్ సమావేశమవుతారు. ఈ మీటింగ్ అనంతరం సాయంత్రం 5 గంటలకు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం హైదరాబాద్ కు చేరుకుని టూరిజం ప్లాజాలో బస చేస్తారు.

Also read: Telangana Identity: ఇడుపు కాగితం అంటే ఎంటో పవన్ కళ్యాణ్ బాగా చెప్తాడు: కల్వకుంట్ల కవిత!

Related News

CM Tours: సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల రిక్వెస్టులు.. ఎందుకో తెలుసా..?

Indiramma Houses: హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. జూలైలో ఇందిరమ్మ ఇళ్ల అప్లికేషన్లు..!

Telangana Identity: ఇడుపు కాగితం అంటే ఎంటో పవన్ కళ్యాణ్ బాగా చెప్తాడు: కల్వకుంట్ల కవిత!

KTR: వికారాబాద్ అడవులను మోదీకి రాసిచ్చారు.. సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలు!

Rowdy Sheeters: గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాజా మాజీ రౌడీ షీటర్ల ఇష్టా రాజ్యం.. వినక పోతే కత్తులతో..?

Advertisement Policy: జీవో నెంబర్ 84లో సంచలన సవరణలు చేసిన తెలంగాణ సర్కార్.. అవి ఇవే..!

నల్గొండలో సీఎం రేవంత్ పర్యటన.. రూ. 13 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!

Big Stories

×